ఎమ్మెల్సీ అనంతబాబు కేసుపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-07-01T08:50:52+05:30 IST

ఎమ్మెల్సీ అనంతబాబు కేసుపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

ఎమ్మెల్సీ అనంతబాబు కేసుపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 30 : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయభాస్కర్‌ (అనంతబాబు) డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకేసులో కాకినాడ పోలీసులు సక్రమంగా విచారణ నిర్వహించడంలేదని ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం (ఏపీసీఎల్‌ఏ) రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మాంధాత సీతారామమూర్తి, సభ్యుడు జి.శ్రీనివాసరావుతో కూడిన బృందానికి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ, సోదరుడు నవీన్‌తో కలిసి గురువారం ఫిర్యాదుచేశారు. అనంతరం సుబ్బారావు విలేకరులతో మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం హత్యకేసు ఏ విధంగా పక్కదోవ పట్టించే ప్రయత్నాలు జరిగిందో 58 పేజీల డాక్యుమెంట్‌ ఆధారాలు, కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అనంతబాబుకు అనుకూలంగా మాట్లాడిన సీడీని, ఫిర్యాదు పత్రాన్ని కమిషన్‌కు ఇచ్చినట్టు  తెలిపారు.

Updated Date - 2022-07-01T08:50:52+05:30 IST