పంచాయతీ కార్యదర్శిపై కమిషనర్‌కు ఫిర్యాదు

Jun 17 2021 @ 00:40AM

కోహెడ, జూన్‌ 16: కోహెడ మండలం రామచంద్రాపుర్‌ పంచాయతీ కార్యదర్శి సావుల సరస్వతి పంచాయతీ నిధుల్లో అక్రమాలకు పాల్పడుతున్నదని ఆ గ్రామ ఉప సర్పంచ్‌ శ్రీకాంత్‌ రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. పే బిల్లులపై సంతకం పెట్టాలని తనపై ఒత్తిడి తెస్తున్నదని, విధులకు సరిగా హాజరు కావడం లేదని ఫిర్యాదులో వాపోయాడు. చేయని పనికి బిల్లులు చెల్లించాలని తనకు కూడా కమీషన్‌ ఇస్తానని అవినీతిని ప్రొత్సహిస్తుందని, సర్పంచ్‌తో కలిసి ఉపసర్పంచ్‌ పదవి నుంచి తొలగిస్తానని బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు.

Follow Us on: