ఇసుక రీచ్‌లో అక్రమాలపై ఫిర్యాదు చేసినా స్పందన లేదు

ABN , First Publish Date - 2022-05-24T06:02:06+05:30 IST

జమ్మలమడుగులోని పెన్నానది పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌లో అక్రమాలపై ఈనెల 12వ తేదీ మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ ఎమ్మెల్సీ దేవగుడి శివనాథరెడ్డి అన్నారు. ఇలానే కొనసాగితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. సోమవారం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పెన్నానది ఇసుక రీచ్‌లో అధిక లోడుతో రోజుకు 200పైగా ట్రాక్టర్లు, వంద టిప్పర్లు, 50 లారీలు ఇసుకను తరలిస్తున్నాయన్నారు.

ఇసుక రీచ్‌లో అక్రమాలపై ఫిర్యాదు చేసినా స్పందన లేదు
విలేకర్లతో మాట్లాడుతున్న టీడీపీ ఎమ్మెల్సీ దేవగుడి శివనాథరెడ్డి

ఇలాగే కొనసాగితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా

టీడీపీ ఎమ్మెల్సీ దేవగుడి శివనాథరెడ్డి

జమ్మలమడుగు రూరల్‌, మే 23: జమ్మలమడుగులోని పెన్నానది పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌లో అక్రమాలపై ఈనెల 12వ తేదీ మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ ఎమ్మెల్సీ దేవగుడి శివనాథరెడ్డి అన్నారు. ఇలానే కొనసాగితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. సోమవారం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పెన్నానది ఇసుక రీచ్‌లో అధిక లోడుతో రోజుకు 200పైగా ట్రాక్టర్లు, వంద టిప్పర్లు, 50 లారీలు ఇసుకను తరలిస్తున్నాయన్నారు. ఇదే రీతిన తరలిస్తే ప్రభుత్వం అనుమతించిన మేరకు రీచ్‌ నుంచి 40 వేల టన్నుల క్వాంటిటి లేదా 30వేల క్యూబిక్‌ మీటర్ల క్వాంటిటీ ఇసుక 9 రోజుల్లో ఖాలీ అవుతుందన్నారు. వంద రోజులు దాటుతున్నా రీచ్‌ నుంచి ఇసుకను తరలిస్తున్నారన్నారు. క్వారీకి పర్మిషన్‌ ఇచ్చిన బౌండరీలు, లోతును దాటి ఇసుకను తోడేస్తున్నారని అన్నారు. దీని వలన మున్సిపాలిటీ పరిసర ప్రాంతాలకు సాగునీటికి ఇబ్బందులు వస్తాయన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరు మీద టిప్పర్లు పెట్టుకుని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా బయటి రాష్ట్రాలకు ఇసుక తోలి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఈ తంతు జిల్లా అధికారులకు, ఎస్‌ఈబీ అధికారులకు తెలిసినా, తాను ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. భవిష్యత్తులో స్టీల్‌ప్లాంట్‌కు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మైలవరం నుంచి ప్రొద్దుటూరు వరకు ఉన్న అన్ని ఇసుక రీచ్‌లను వెంటనే మూసివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జె.రమణారెడ్డి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-24T06:02:06+05:30 IST