ఫిర్యాదుల పరిష్కారంపై సీఎం సమీక్ష

ABN , First Publish Date - 2022-05-17T06:50:33+05:30 IST

స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం విషయంలో ప్రతి 15 రోజులకు ఒకసారి సీఎం జగన్‌ సమీక్ష నిర్వహిస్తున్నారని, అలాగే ప్రతి గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నారని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు.

ఫిర్యాదుల పరిష్కారంపై సీఎం సమీక్ష
ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న జేసీ శ్రీధర్‌

  • రేపు డీఆర్‌సీ సమావేశం: జేసీ శ్రీధర్‌ 
  • కలెక్టరేట్‌ స్పందనకు 143 ఫిర్యాదులు

రాజమహేంద్రవరం రూరల్‌, మే 16: స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం విషయంలో ప్రతి 15 రోజులకు ఒకసారి సీఎం జగన్‌ సమీక్ష నిర్వహిస్తున్నారని, అలాగే ప్రతి గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నారని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 18న జిల్లా డీఆర్‌సీ సమావేశాన్ని కలెక్టర్‌ నిర్వహిస్తారని తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిద మండలాల నుంచి వచ్చిన 143 మంది జేసీ శ్రీధర్‌ను కలిసి అర్జీలను అందించారు. ఉదయం 10 గంటలకు స్పందన కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్‌ కే మాధవీలత జిల్లాలో మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లడంతో కలెక్టరేట్‌లో జేసీ స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రభుత్వ ఇళ్లు, పింఛన్లు, రేషన్‌ కారు ్డలు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, జయలక్ష్మి బ్యాంకు బాధితులు, ఇలా అనేక పనులపై లబ్ధిదారులు అర్జీలను అందించారు. కార్యక్రమంలో డీఆర్‌వో ఏ సుబ్బారావు, జిల్లా అధికారులు ఐసీడీఎస్‌ పీడీ విజయకుమారి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ స్వర్ణలత, డీహెచ్‌వో బి.తారాచంద్‌, సీపీవో పి.రాము, డీఎం సివిల్‌ సప్లయిస్‌ కె.తులసి, డీఎస్‌వో పి.ప్రసాదరావు, తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T06:50:33+05:30 IST