యోగాసనాలతోనే సంపూర్ణ ఆరోగ్యం

ABN , First Publish Date - 2022-09-27T06:27:39+05:30 IST

యోగాసనాలతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి యోగాసన పోటీలను జ్యోతిప్రజ్వలన చేసి ఆయన సోమా రం ప్రారంభించారు.

యోగాసనాలతోనే సంపూర్ణ ఆరోగ్యం
జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి


నల్లగొండ, సెప్టెంబరు 26: యోగాసనాలతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి యోగాసన పోటీలను జ్యోతిప్రజ్వలన చేసి ఆయన సోమా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రీడాకారులకు చదువుతో పాటు యోగా ఎంతో అవసరమన్నారు. యోగాలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తే విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్‌ సౌక ర్యం ఉందన్నారు. నల్లగొండలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం గర్వించదగ్గ విషయం అన్నారు. అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి నందనం కృపాకర్‌ మాట్లాడుతూ, ఈనెల 28వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పోటీలు కొనసాగుతాయన్నారు. ఈ పోటీలకు ఉమ్మడి 10 జిల్లాల నుం చి 420 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారిలో 54 మందిని జాతీయస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. వారు అక్టోబరులో ఢిల్లీలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి తర్ఫీదు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మన్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బోయపల్లి కృష్ణారెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సభ్యుడు బి.రాంరెడ్డి, తోట సతీష్‌, సింహాద్రి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


హోరాహోరీగా పోటీలు

రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు తొలి రోజు హోరాహోరీగా సాగాయి. మొత్తం 420 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలను పర్యవేక్షించేందుకు 60 మంది న్యాయనిర్ణేతలు, పరిశీలకులు, కోచ్‌లు నల్లగొండకు రావడంతో సందడి వాతావరణం ఏర్పడింది.

Updated Date - 2022-09-27T06:27:39+05:30 IST