‘నాడు-నేడు’ పనులను త్వరగా పూర్తిచేయండి

ABN , First Publish Date - 2021-02-26T04:01:53+05:30 IST

శాలల్లో ‘నాడు-నేడు’ పను లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం స్థానిక సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బయోమెట్రిక్‌ హాజరు, అమ్మ ఒడి జాబితాను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ఆరాతీశారు. తక్షణం వాటిని నమోదుచేయాలని.. సాధ్య మైనంతవరకూ ఎప్పటికప్పుడు పరిష్కారమార్గం చూపాలని ఆదేశించారు. అనంతరం మండలస్థాయి అధికారులతోను, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మండలంలో 38 పాఠశాలల్లో నాడు-నేడ పనులపై ఆరాతీశారు. గడువులోగా పూర్తిచేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. మండలానికి 227 ఇళ్లు మంజూరుకాగా... 160 ఇళ్లుకు మాత్రమే జియో ట్యాగింగ్‌ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హౌసింగ్‌ డీఈ కె.అప్పారావు, ఏఈ వి.ప్రసాదరావు, ఎంఈవో బి.మాధవరావు, జేఈ చంద్రమౌళి, వీఆర్వో రాము పాల్గొన్నారు.

‘నాడు-నేడు’ పనులను త్వరగా పూర్తిచేయండి
మాట్లాడుతున్న జేసీ శ్రీనివాసులు




 జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు

జలుమూరు, ఫిబ్రవరి 25: ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పను లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం స్థానిక సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బయోమెట్రిక్‌ హాజరు, అమ్మ ఒడి జాబితాను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ఆరాతీశారు. తక్షణం వాటిని నమోదుచేయాలని.. సాధ్య మైనంతవరకూ ఎప్పటికప్పుడు పరిష్కారమార్గం చూపాలని ఆదేశించారు. అనంతరం మండలస్థాయి అధికారులతోను, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మండలంలో 38 పాఠశాలల్లో నాడు-నేడ పనులపై ఆరాతీశారు. గడువులోగా పూర్తిచేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. మండలానికి 227 ఇళ్లు మంజూరుకాగా... 160 ఇళ్లుకు మాత్రమే జియో ట్యాగింగ్‌ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హౌసింగ్‌ డీఈ కె.అప్పారావు, ఏఈ వి.ప్రసాదరావు, ఎంఈవో బి.మాధవరావు, జేఈ చంద్రమౌళి, వీఆర్వో రాము పాల్గొన్నారు.





Updated Date - 2021-02-26T04:01:53+05:30 IST