ఆగస్టు 15 లోగా కలెక్టరేట్‌ భవన నిర్మాణం పూర్తి చేయండి

ABN , First Publish Date - 2022-05-17T06:55:55+05:30 IST

సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దాలని, నిర్మాణ పనులు ఆగస్టు 15 లోగా పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఆగస్టు 15 లోగా కలెక్టరేట్‌ భవన నిర్మాణం పూర్తి చేయండి
అధికారులతో మాట్లాడుతున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

అధికారులకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశం 

ప్రారంభోత్సవానికి సీఎం వస్తారని వెల్లడి

నిర్మల్‌అర్బన్‌, మే 16 : సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దాలని, నిర్మాణ పనులు ఆగస్టు 15 లోగా పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్‌ సముదాయ భవన నిర్మాణ పనులు జరుగుతున్న తీరును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరి శీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్ర స్తుతం పనులు ఏ దశలో ఉన్నాయనే దానిపై అధికారులతో సమీక్ష నిర్వ హించారు. ఐడీవోసీ (ఇంటిగ్రేటెడ్‌ డిస్ర్టిక్ట్‌ ఆఫీసర్స్‌ కాంప్లెక్స్‌) భవన నిర్మా ణంలో భాగంగా ఉద్యానపనులను, అప్రోచ్‌రోడ్‌, కాంపౌండ్‌వాల్‌, ఆర్చి పను లు పరిశీలించిన మంత్రి సంబంధిత పనులను వేగవంతం చేయాలని ఆదే శించారు. కార్యాలయంలో ఉద్యోగులకు, ఆయా పనుల కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. తాగునీటివసతి, టాయిలెట్స్‌, తదితర వసతులన్నీ కల్పించాలని సూచించారు. కలెక్టరేట్‌ ఆవరణలో పచ్చదనం కోసం మొక్కలను నాటాలన్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఆగస్టు 15లోగా పనులన్ని పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించామ న్నారు. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఐసీవోసీ భవనాన్ని ప్రారంభించ నున్నట్లు మంత్రి తెలిపారు. అప్రోచ్‌ రోడ్‌, ఇతర సుందీకరణ పనులు పూర్తయితే నిర్మల్‌ పట్టణానికి దీనివల్ల అదనపు హంగులు కలుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ ఇంజనీర్‌ ఇన్‌చీఫ్‌ గణపతిరెడ్డి, కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అధికారులు, ప్రజాప్రతినిధు లు పాల్గొన్నారు. 

95 శాతం స్థానికులకే ఉద్యోగాలు

నిర్మల్‌ కల్చరల్‌, మే 16 : పోలీస్‌శాఖలో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభిస్తాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఐకేఆర్‌ ఫౌండేషన్‌ ఉచిత శిక్షణ శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 90 వేల ఉద్యోగాల ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. అభ్యర్థులు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఫౌండేషన్‌ చైర్మన్‌ గౌతమ్‌ రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T06:55:55+05:30 IST