ఓటరు స్లిప్పుల పంపిణీ వందశాతం పూర్తి చేయండి

ABN , First Publish Date - 2021-03-07T04:40:27+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరిగే వార్డుల్లో బీఎల్‌వోల ద్వారా వందశాతం ఓటరు స్లిప్పుల పంపిణీని ఆదివారంలోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆదేశించారు.

ఓటరు స్లిప్పుల పంపిణీ వందశాతం పూర్తి చేయండి

మున్సిపల్‌ కమిషనర్లకు కలెక్టర్‌ ఆదేశం


చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 6: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరిగే వార్డుల్లో బీఎల్‌వోల ద్వారా వందశాతం ఓటరు స్లిప్పుల పంపిణీని ఆదివారంలోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించేలా ఫ్లయిండ్‌ స్వాడ్స్‌, ఎంసీసీటీ, సర్వేలైన్స్‌ బృందాలు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. స్ర్టాంగ్‌ రూములలో బ్యాలెట్‌ బాక్సులు భద్రపరిచే ప్రాంతాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వీడియో కాన్పరెన్స్‌లో తిరుపతి నగరపాలక కమిషనర్‌ గిరీష, చిత్తూరు కమిషనర్‌ విశ్వనాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో 10న జరగనున్న పోలింగ్‌, 14న జరిగే కౌంటింగ్‌ ఏర్పాట్లపై అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జేసీలు మార్కొండేయులు, వీరబ్రహ్మం, రాజశేఖర్‌, డీఆర్వో మురళితో చర్చించారు.

Updated Date - 2021-03-07T04:40:27+05:30 IST