ధాన్యం కొనుగోలు గడువులోగా పూర్తి చేయండి : అదనపు కలెక్టర్‌ రాంబాబు

ABN , First Publish Date - 2022-05-15T06:32:30+05:30 IST

నిర్దేశించిన గడువులోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయా లని జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు అన్నారు.

ధాన్యం కొనుగోలు గడువులోగా పూర్తి చేయండి : అదనపు కలెక్టర్‌ రాంబాబు
చించాలలో ధాన్యం పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ రాంబాబు

ముధోల్‌, మే 14 : నిర్దేశించిన గడువులోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయా లని జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు అన్నారు. శనివారం ముధోల్‌ మండలం లోని చించాల, ఎడ్‌బిడ్‌, చింతకుంట, వడ్తాల్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 25 లోపు వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసి త్వరితగతిన డబ్బులు అందేలా చూడాలన్నారు. వరి కొనుగోలు కేంద్రాలలో హమాలీల సంఖ్య పెంచాలని నిర్వాహకులకు సూచిం చారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. అలాగే ఎడ్‌బిడ్‌ రైస్‌ మిల్‌ను తనిఖీ చ ఏశారు. ఈ కార్య క్రమంలో పౌరసరఫరాల శాఖ డీఎం శ్రీకళ, ముధోల్‌ తహసీల్దార్‌ శ్యాంసుందర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ రమేష్‌, చింతకుంట సర్పంచ్‌ రాజేందర్‌ రెడ్డి, పీఏసీఎస్‌ సీఈవో సాయిరెడ్డి, స్థానిక నాయకులు, రెవిన్యూ సిబ్బంది, రైతులు, తది తరులు ఉన్నారు. 

Updated Date - 2022-05-15T06:32:30+05:30 IST