గడ్కరీ అందించిన సహకారంతో వేగంగా పూర్తి చేశాం: జగన్‌

ABN , First Publish Date - 2022-02-17T21:05:46+05:30 IST

740 కిలోమీటర్ల పొడవున 30 రహదారుల పనులకు కేంద్రమంత్రి, నితిన్ గడ్కరీ, సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

గడ్కరీ అందించిన సహకారంతో వేగంగా పూర్తి చేశాం: జగన్‌

అమరావతి: 740 కిలోమీటర్ల పొడవున 30 రహదారుల పనులకు కేంద్రమంత్రి, నితిన్ గడ్కరీ, సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మరో 21 రహదారులను పూర్తిచేసి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 2019 ఆగస్ట్‌లో బెంజ్‌ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేంద్రాన్ని కోరామని తెలిపారు. గడ్కరీ అందించిన సహకారంతో వేగంగా పూర్తి చేశామని జగన్‌ తెలిపారు. బెంజిసర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌తో పాటు నిర్మాణం పూర్తయిన పలు జాతీయ రహదారులను ప్రారంభించారు. కొత్తగా నిర్మించే జాతీయ రహదారులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో జగన్, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. గతేడాది డిసెంబరులోనే నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి వచ్చి పూర్తయిన బెంజిసర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌ను ప్రారంభించాల్సి ఉంది. కానీ ఆ పర్యటన రద్దయింది. వాహనదారులకు అసౌకర్యంగా ఉండకూడదన్న ఉద్దేశంతో ఆ ఫ్లైఓవర్‌పై వాహనాలను అనుమతిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి సమయం ఇవ్వడంతో ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు.

Updated Date - 2022-02-17T21:05:46+05:30 IST