ముగిసిన పదో తరగతి పరీక్షలు

ABN , First Publish Date - 2022-05-29T06:01:10+05:30 IST

పదో తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 23న ప్రారంభమైన పరీక్షలు 28న శనివారంతో ముగిశాయి. జిల్లాలో 60 పరీక్షా కేంద్రాల్లో 9,477 మంది విద్యార్థులకు 99.01శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

ముగిసిన పదో తరగతి పరీక్షలు

99.01శాతం విద్యార్ధులు హాజరు 

భువనగిరి టౌన్‌, మే 28: పదో తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 23న ప్రారంభమైన పరీక్షలు 28న శనివారంతో ముగిశాయి. జిల్లాలో 60 పరీక్షా కేంద్రాల్లో 9,477 మంది విద్యార్థులకు 99.01శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తుర్కపల్లి పరీక్షాకేంద్రంలో ఓ విద్యార్థిని ఫిట్స్‌తో పడిపోవడం మినహా పరీక్షలన్నీ ప్రశాంతంగా కొనసాగాయి. గతానికి భిన్నంగా కేవలం ఆరు పరీక్షలు మాత్రమే జరిగాయి. పరీక్షల చివరి రోజున పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఉత్సాహంగా, ఉల్లాసంగా కేరింతలు వేశారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతూనే పరస్పరం వీడ్కోలు పలుకుకున్నారు. అయితే ప్రైవేట్‌ కళాశాలల ప్రతినిధులు అడ్మిషన్ల ప్రచారంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి చేశారు. కలెక్టర్‌ పమేలాసత్పథి, డీఈవో కె.నర్సింహ తదితర అధికారులు పరీక్షా కేంద్రాలను నిరంతరం సందర్శించారు. జూన్‌ 2 నుంచి స్పాట్‌ వాల్యూవేషన్‌ ప్రారంభమై 25న పరీక్షా ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా ఒకేషనల్‌ విద్యార్థులకు మాత్రం సోమవారంతో పరీక్షలు ముగియనున్నాయి. ఇందుకోసం 900 మంది విద్యార్థులకు గాను జిల్లావ్యాప్తంగా 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-05-29T06:01:10+05:30 IST