ముగిసిన పదో తరగతి పరీక్షలు

ABN , First Publish Date - 2022-05-29T06:17:43+05:30 IST

జిల్లా వ్యాప్తంగా శనివారం పదో తరగతి ప్రధాన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈనెల 23వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా 107 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా మొత్తం 19,907 మంది విద్యార్థులకు, 1,058 మంది గైర్హాజరయ్యారు.

ముగిసిన పదో తరగతి పరీక్షలు
పరీక్షలు ముగియడంతో విద్యార్థుల కేరింతలు

నల్లగొండ, మే 28 : జిల్లా వ్యాప్తంగా శనివారం పదో తరగతి ప్రధాన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈనెల 23వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా 107 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా మొత్తం 19,907 మంది విద్యార్థులకు, 1,058 మంది గైర్హాజరయ్యారు. మాల్‌ప్రాక్టీ్‌సకు పాల్పడుతున్న నలుగురు విద్యార్థులను అధికారులు డీబార్‌ చేశారు. నకిరేకల్‌లో విద్యార్థుల తల్లిదండ్రులు చీటులు అందించడం చర్చనీయాంశంగా మా రింది. చివరి రోజు సాంఘిక పరీక్షకు 19, 731 మంది విద్యార్థులు హాజరుకాగా, 178 మంది గైర్హాజరయ్యారు. డీఈవో బొల్లారం భిక్షపతి ఆరు పరీక్ష కేంద్రాలను తనిఖీచేయగా, ఆరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 31 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. కాగా, పరీక్షలు ముగియడంతో విద్యార్థులు స్నేహితులకు వీడ్కోలు పలికి హాస్టళ్ల నుంచి గ్రామాలకు చేరారు.

Updated Date - 2022-05-29T06:17:43+05:30 IST