దుబ్బాకకు పూర్తిగా అన్యాయం

ABN , First Publish Date - 2020-10-27T11:46:15+05:30 IST

దుబ్బాక నియోజకవర్గం వెనుకబడటానికి మంత్రి హరీశ్‌రావే కారణం. ఇక్కడి నిధులన్నీ సిద్దిపేటకు తరలించి దుబ్బాకకు పూర్తిగా అన్యాయం చేశారని బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు

దుబ్బాకకు పూర్తిగా అన్యాయం

ఇక్కడి నిధులన్నీ సిద్దిపేటకు తరలించింది హరీశే

ఉప ఎన్నికలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం

టీఆర్‌ఎ్‌సలో ఉన్న చెరుకు శ్రీనివా్‌సరెడ్డి                                   

లోపాయికారీ ఒప్పందంతోనే కాంగ్రె్‌సలోకి 

బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు


మిరుదొడ్డి, అక్టోబరు 26: దుబ్బాక నియోజకవర్గం వెనుకబడటానికి మంత్రి హరీశ్‌రావే కారణం. ఇక్కడి నిధులన్నీ సిద్దిపేటకు తరలించి దుబ్బాకకు పూర్తిగా అన్యాయం చేశారని బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు. సోమవారం మిరుదొడ్డి మండలం చెప్యాల, తడ్కపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షోను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దుబ్బాక అభివృద్ధి చెందకుండా ఇక్కడి నిధులన్నీ సిద్దిపేట, గజ్వేల్‌కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్రామగ్రామాన బీజేపీకి ప్రజాధరణ పెరుగుతున్నదని గ్రహించిన టీఆర్‌ఎస్‌ తప్పుడు కేసులు, వేధింపులకు పాల్పడుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. కొంతమంది కార్యకర్తలను గ్రామాల్లో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతుందని, ప్రజలు గ్రహిస్తున్నారని, టీఆర్‌ఎ్‌సకు తగిన గుణపాఠం చెబుతారని అభిప్రాయపడ్డారు. దుబ్బాక నియోజకవర్గాన్ని ఏనాడు పట్టించుకోని హరీశ్‌రావు ఇప్పుడు మాత్రం ఉపఎన్నికలో కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.


అప్రజాస్వామికంగా దుబ్బాక ఎన్నికలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. హరీశ్‌రావు అనుచరణం దుబ్బాకలోని నాయకత్వాన్నీ అజమాయిషీ చేయడం చూస్తే, చీమునెత్తురు ఉన్న దుబ్బాక నాయకత్వం తిరగబడాలన్నారు. దుబ్బాకలో శంకుస్థాపన చేసుకున్న పాలీటెక్నిక్‌ కళాశాలను సిద్దిపేటకు తరలించారని, దుబ్బాక నాయకుడిని క్యాంపు కార్యాలయానికి పరిమితం చేసి ఉన్న నిధులను అప్పనంగా తరలించారని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌ దుబ్బాకలో చదివిన ప్రేమ ఉంటే దుబ్బాక మండలంలోని 12 గ్రామాలు తమవే అయితే పెద్దగుండవెళ్లి, బల్వంతాపూర్‌, అప్పనపల్లి రైతుల భూములు కాలువ నిర్మాణాల్లో కోల్పోతే కనీసం పరిహారం ఇవ్వడంలేదన్నారు. దుబ్బాక ప్రాంత ప్రజలు ముంపు, కంపుతో తల్లడిల్లుతున్నారని ఆవేదన చెందారు. దుబ్బాక ఓటర్లు ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ చెంపచెల్లుమనేలా తీర్పునివ్వాలని కోరారు.


టీఆర్‌ఎస్‌లో ఉన్న చెరుకు శ్రీనివా్‌సరెడ్డిని లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయిస్తున్నారని ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందనే ఉద్దేశంతోనే మంత్రి హరీశ్‌రావు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ఈ ఎన్నిక తెలంగాణ, దుబ్బాక ప్రాంత అభివృద్ధికి దారితీస్తుందని, కేసీఆర్‌కు కనువిప్పు కలుగుతుందని చెప్పారు. బీజేపీకి పట్టం కట్టి, టీఆర్‌ఎ్‌సకు కర్రుకాల్చి వాత పెట్టాలని కోరారు.


దుబ్బాకలో బీజేపీని గెలిపిప్తే సిద్దిపేట, గజ్వేల్‌ తరహాలో అభివృద్ధి చేస్తానని హామినిచ్చారు. గెలిచిన తర్వాత అభివృద్ధి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రానని ఆయన చెప్పారు. అనంతరం ఆయా గ్రామాల్లో సుమారు 100 మంది టీఆర్‌ఎస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ మిరుదొడ్డి మండల అధ్యక్షుడు దేవరాజు, నాయకులు విభూషణ్‌రెడ్డి, శ్రీనివాస్‌, నర్సింలు, మల్లేశం, సంజీవ్‌, ఎల్లం, కొమురయ్య, రామచంద్రం, వెంకట్‌గౌడ్‌, రాజశేఖర్‌, భూపాల్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-27T11:46:15+05:30 IST