కాంప్లెక్స్‌ ఎరువులు ఖాళీ!

ABN , First Publish Date - 2021-05-07T05:38:03+05:30 IST

జిల్లాలో కాంప్లెక్స్‌ ఎరువులు ఖాళీ అయ్యా యి. కేంద్ర ప్రభుత్వం కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెంచడం తో ఎరువుల గోదాములు ఖాళీ అవుతున్నాయి. కాంప్లెక్స్‌ ఎ రువుల ధరలు ఒక్కో బస్తాకు 300 రూపాయల నుంచి 700 రూపాయల వరకు అమాంతంగా పెరిగిపోవడంతో రైతులు కాంప్లెక్స్‌ ఎరువులను ముందస్తుగా కొనుగోలు చేస్తున్నారు.

కాంప్లెక్స్‌ ఎరువులు ఖాళీ!
కోటగిరిలో సొసైటీ గోదాం నుంచి కాంప్లెక్స్‌ ఎరువులను తీసుకెళ్తున్న రైతులు

ధరల పెరుగుదలతో ఎరువులన్నీ విక్రయం

జిల్లాలో ఖాళీ అయిన ఎరువుల గోదాంలు

ఎరువుల ధరల పెంపుపై రైతుల మండిపాటు

బోధన్‌, మే 6: జిల్లాలో కాంప్లెక్స్‌ ఎరువులు ఖాళీ అయ్యా యి. కేంద్ర ప్రభుత్వం కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు  పెంచడం తో ఎరువుల గోదాములు ఖాళీ అవుతున్నాయి. కాంప్లెక్స్‌ ఎ రువుల ధరలు ఒక్కో బస్తాకు 300 రూపాయల నుంచి 700 రూపాయల వరకు అమాంతంగా పెరిగిపోవడంతో రైతులు కాంప్లెక్స్‌ ఎరువులను ముందస్తుగా కొనుగోలు చేస్తున్నారు. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు ఊహించరని రీతిలో పెరగడంతో రైతులు పాత స్టాక్‌ను పాత ధరలకే కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. జిల్లాలో గురువారం ఒక్కరోజే దాదాపు కాంప్లెక్స్‌ ఎరువుల నిల్వలు ఖాళీ అయ్యాయి. గోదాములన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గురువారం సహకార సొసైటీలు ప్రైవేటు ఎరువుల డీలర్లు గ్రోమోర్‌ల వద్ద రైతులు ట్రాక్టర్లతో బారులు తీరారు. ఒక్కో బస్తాకు పెద్దమొత్తంలో ఎరువుల ధ రలు పెరగడంతో రైతులు ఎరువులు కొనుగోలు చేసి నిల్వ చేసుకునేందుకు ఆత్రుత పడ్డారు. జిల్లాలో కాంప్లెక్స్‌ ఎరువు లు ఒక్క రోజులోనే పెద్ద మొత్తంలో విక్రయాలు జరిగాయి. దాదాపు పాత ధరలతో కొనుగోలు చేసిన ఎరువులన్నీ ఖాళీ కానున్నాయి. రైతులు పెరిగిన ఎరువుల ధరలతో పాత ధర లకు ఎరువులు కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. మరోవైపు కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు ఇబ్బడిమొబ్బడిగా పెర గడం రైతులకు ఆగ్రహావేశాలు తెప్పిస్తోంది. ఒక్కో బస్తాకు 300 రూపాయల నుంచి 700 రూపాయల వరకు ధర పెర గడం చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయి తే వ్యవసాయం ఎలా చేసేదని రైతులు మండిపడుతున్నా రు. పెరిగిన ధరలతో అప్రమత్తమైన రైతాంగం కాంప్లెక్స్‌ ఎ రువులను నిల్వలు చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. జి ల్లాలోని బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ డివిజన్‌ల పరిధిలో గురువారం ఒక్కరోజే దాదాపు గోదాములు ఖాళీ అయ్యాయి. కాంప్లెక్స్‌ ఎరువులు పెద్ద మొత్తంలో అమ్మకాలు జరిగాయని వ్యవసాయశాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఒక్కో సొసై టీ పరిధిలో 5 నుంచి 10లక్షల రూపాయల ఎరువులు, ప్రైవే టు డీలర్ల వద్ద గ్రోమోర్‌ కేంద్రాలలో మరో 5 నుంచి 10లక్షల రూపాయల వరకు ఒక్కరోజులోనే ఎరువుల విక్రయాలు జరి గాయి. గురువారం ఉదయం నుంచి కాంప్లెక్స్‌ ఎరువుల కో సం రైతులు పోటీపడ్డారు. పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరల ను రైతులకు ఇబ్బందికరంగా మారాయి. ఒక్కో రైతుపై తీవ్ర భారం పడనుంది. ఒక్కో రైతు ఎకరాకు 5బస్తాల వరకు కాం ప్లెక్స్‌ ఎరువులు వినియోగించే పరిస్థితులు ఉండడంతో ఎక రాకు మరో 2వేల నుంచి 4వేల రూపాయల వరకు అదనపు భారం పెట్టుబడి రూపంలో పడిందని రైతులు వాపోతున్నా రు. ఇప్పటికైనా కేంద్రం ఎరువుల ధరల విషయంలో రైతుల కు మేలు జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. 

రైతులకు గుదిబండలా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు 

- కొల్లూరు కిషోర్‌,  రైతుబంధు సమితి అధ్యక్షుడు, కోటగిరి

పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు రైతులకు గుదిబండ గా మారాయి. ఒక్కో బస్తాపై 300 రూపాయల నుంచి 700 రూపాయల వరకు కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరగడం రై తులను వ్యవసాయానికి దూరం చేసేలా ఉన్నాయి. ఇప్పటికే దిగుబడులు రాక రైతులు వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితులున్నాయి. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెంచి రైతుల ను మరింత అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. కాంప్లెక్స్‌ ఎరు వుల ధరలపెంపు రైతులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. 

Updated Date - 2021-05-07T05:38:03+05:30 IST