విద్యాకానుక కిట్లపై సమగ్ర విచారణ జరపాలి : ఎస్‌ఎఫ్‌ఐ

ABN , First Publish Date - 2021-04-18T06:23:45+05:30 IST

గత విద్యాసంవత్సరంలో విద్యాకానుక కిట్‌లలో జరిగిన గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరపాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి బాబావలి డిమాండ్‌ చేశారు.

విద్యాకానుక కిట్లపై సమగ్ర విచారణ జరపాలి : ఎస్‌ఎఫ్‌ఐ
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు

హిందూపురం టౌన, ఏప్రిల్‌ 17: గత విద్యాసంవత్సరంలో విద్యాకానుక కిట్‌లలో జరిగిన గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరపాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి బాబావలి డిమాండ్‌ చేశారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో విద్యాకానుక కిట్‌ల విషయంలో 16కోట్లు గోల్‌మాల్‌ జరిగినట్లు రావడంపై శనివారం స్పందించారు. ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలన్నారు. గత యేడాది విద్యాకానుక కిట్‌లు అందలేదని, నాిశిరకం కిట్‌లు వస్తున్నాయని ఎస్‌ఎ్‌ఫఐ బృందం విద్యాశాఖ కమిషనర్‌ చిన్నవీరభద్రుడు, జిల్లాస్థాయిలో డీఈఓ దృష్టికి తీసుకెళ్లాం.  అయితే రూ.16 కోట్ల మేర దోపిడి చేశారని వస్తున్న వార్తలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని విద్యాకానుక కిట్‌లపై విచారణ జరిపించాలన్నారు. ఎవరికి కాంట్రాక్ట్‌ ఇచ్చారు, ఒక్కో కిట్‌పై ఎంత ఖర్చు వేశారో విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఎస్‌ఎ్‌ఫఐ జయచంద్ర, తరుణ్‌, సుధీర్‌, చంద్ర, జశ్వంత, పవన, తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-04-18T06:23:45+05:30 IST