
కువైత్ సిటీ: కమర్షియల్ విజిట్ వీసా విషయమై తాజాగా కువైత్ కొత్త యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇకపై విజిట్ వీసా కావాలంటే తప్పనిసరిగా 20కువైటీ దినార్ల(రూ.4,985)తో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనే కొత్త కండిషన్ పెట్టనుందట. ఈ మేరకు యూనియన్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ఛైర్మన్ ఖలేద్ అల్ హసాన్ కీలక ప్రకటన చేశారు. కమర్షియల్ విజిట్ వీసాలపై కువైత్‌కు వచ్చే విదేశీయులకు 20కేడీల హెల్త్ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేసే యోచనలో సర్కార్ ఉందన్నారు. ఇప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రభుత్వానికి దీని తాలూకు సమాచారాన్ని అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. కమర్షియల్ విజిట్ వీసాపై కువైత్ వచ్చే ప్రవాసులు.. దేశంలో ఒక్కరోజు స్టే చేసినా లేక నెల రోజులు ఉన్నా ఈ 20కేడీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం తప్పనిసరి అని ఖలేద్ అల్ హసాన్ చెప్పుకొచ్చారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి