విద్యార్థులకు బహుమతి అందిస్తున్న మధురేసు దాసు
ప్రొద్దుటూరు టౌన్, మే 15 : విద్యార్థులు భగవద్గీత పఠించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని ఇస్కాన్ కేంద్రం భక్తుడు మధురేసుదాసు పేర్కొన్నారు. వేసవి సెలవులను పురస్కరించుకుని విద్యార్థులకు భగవద్గీతపై శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి మొదటి బహుమతి రూ.3వేలు, ద్వితీయ బహుమతి రూ.2వేలు, తృతీయ బహుమతి రూ.1000 తోపాటు భగవద్గీత పుస్తకాలను, సర్టిఫికెట్లను అందించారు. భక్తులు భజన చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ భక్తులు పాల్గొన్నారు.