కాన్సెప్ట్‌ సిటీగా ‘అనంత’

ABN , First Publish Date - 2020-08-08T08:21:30+05:30 IST

అనంత నగరాన్ని కాన్సెప్ట్‌ సిటీగా ఎంపిక చేశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం, తిరుపతి, ..

కాన్సెప్ట్‌ సిటీగా ‘అనంత’

 ప్రణాళిక రూపకల్పనకు రూ.84.85 లక్షలు


అనంతపురం కార్పొరేషన్‌, ఆగస్టు 7: అనంత నగరాన్ని కాన్సెప్ట్‌ సిటీగా ఎంపిక చేశారు.  ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం నగరాలను కాన్సెప్ట్‌ సిటీలుగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అనంతపురం నగర ప్రణాళిక రూపకల్పనకు రూ84.85 లక్షలతో పరిపాలన అనుమతులను స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ కరికాల వలవెన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాన్సెప్ట్‌ సిటీ ప్రణాళిక, పెట్టుబడుల ఆకర్షణ, వాణిజ్య వ్యూహాలకు అనుమతిచ్చారు. ఈ ప్రణాళిక రూపకల్పనకు సీబీఆర్‌ఈ సౌత్‌ఏషియా సంస్థను ఎంపిక చేశారు. ఇందుకు అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాన్సెప్ట్‌ సిటీ  అయితే నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

Updated Date - 2020-08-08T08:21:30+05:30 IST