గన్నీ బ్యాగుల కోసం ఆందోళన

ABN , First Publish Date - 2021-05-11T04:40:39+05:30 IST

గన్నీ బ్యాగుల కోసం ధన్వాడ సింగి ల్‌విండో కార్యాలయం వద్ద సోమవారం రైతుల పెద్ద ఎ త్తున ఆందోళన చేశారు.

గన్నీ బ్యాగుల కోసం ఆందోళన
ధన్వాడ విండో కార్యాలయానికి గన్నీ బ్యాగులతో వచ్చిన లారీల వద్ద ఆందోళన చేస్తున్న రైతులు

- పోలీసు పహరా మధ్య గోదాంలోకి గన్నీ బ్యాగుల లారీ  

ధన్వాడ, మే10: గన్నీ బ్యాగుల కోసం ధన్వాడ సింగి ల్‌విండో కార్యాలయం వద్ద సోమవారం రైతుల పెద్ద ఎ త్తున ఆందోళన చేశారు. గతవారం  రోజుల నుంచి గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉండటంతో ప్రస్తుతం 20 వేల బ్యాగుల లారీ లోడ్‌ రావడంతో రైతులు ఒక్కసారిగా  చుట్టుముట్టారు. తమకు టోకెన్లు ఇచ్చి ఇప్పటి వరకు గన్నీ బ్యాగుల ఇవ్వడం లేదంటూ విండో చైర్మన్‌ వెంకట్రామ్‌రెడ్డితో రైతులు వాగ్వాదానికి దిగారు.  దాంతో పోలీస్‌ పహరా మధ్య గన్నీ బ్యాగులను గోదాంలో దింపించారు. వచ్చిన సంచులను ధన్వాడకు అందిస్తామ ని చైర్మన్‌ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు.  రైతులు గంటల తరబడిగా నిరీక్షించినా ప్రయోజనం లేకుండా పోయింది.

 అర్ధరాత్రి వేళ గన్నీ బ్యాగులు పంపిణీ

 కృష్ణ: ఇష్టం వచ్చిన వారికి అర్ధరాత్రి వేళ గన్నీ బ్యా గులు పంపిణీ చేయడంతో మిగితా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కృష్ణ మార్కెట్‌ యార్డులో చో టు చేసుకుంది. ఆరుగాలం కష్టపడి పండించి కల్లాలకు ధాన్యం చేర్చడం ఒకేత్తైతే వ్యవసాయ శాఖ అధికారుల వద్ద  టోకెన్ల కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  వచ్చిన బ్యాగులను  రైతులకు సరఫరా చేయకుండా ఇష్టానుసారంగా  గుట్టు చప్పుడు కాకుండా ఎలా పంపిణీ చేశారని ప్రశ్నించారు.  

  అంతర్రాష్ట్ర రహదారిపై రైతుల రాస్తారోకో

మాగనూర్‌:  గన్నీ బ్యాగులను అందించాలని, లారీ ల కొరత తీర్చాలని సోమవారం 167వ అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు.  ఉమ్మడి మం డలాల సీపీఎం నాయకులు  రైతులకు మద్దతు తెలి పారు. ఈసందర్భంగా సీపీఎం జిల్లా నాయకుడు ఆంజ నేయులు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించుకున్న వరి ధాన్యం కల్లాల వద్ద రోడ్ల పక్కల నిల్వలు చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయ అధికారుల నుంచి టోకెన్లు తెచ్చి ఇచ్చినా గన్నీ బ్యాగుల కోసం 10-15 రోజులు కార్యాలయం చుట్టూ తిరిగినా  ఫలితం లేకుండా పోతోందన్నారు. మరో పక్క వర్షాలు వస్తే ధాన్యం తడిసిపోతుందని రైతులు భయందోళనలు చెందు తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెబుతుండగా, రైతుల కు గన్నీ బ్యాగులు ఇవ్వలేని దుస్థితిలో అధికారులు ఉ న్నారని విమర్శించారు. సింగింల్‌విండో  అధ్యక్షుడు  వెంకట్‌ రెడ్డి హామీ మేరకు రైతులు రాస్తారోకో విరమిం చారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బాలు, రైతులు రాములు, మారెప్ప, రవీందర్‌, వెంకటేష్‌, బాలప్ప పాల్గొన్నారు.  అలాగే గన్నీ బ్యాగుల కొరత తీర్చాలని  బీజేపీ మండల అధ్యక్షుడు జయనంద్‌రెడ్డి డి మాండ్‌ చేశారు. సోమవారం మండలంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 



Updated Date - 2021-05-11T04:40:39+05:30 IST