కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2022-05-21T06:33:57+05:30 IST

తంగళ్లపల్లి మం డలం లక్ష్మిపూర్‌లో కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకంలో నిర్వాహకులు మోసా నికి పాల్పడ్డారని రైతులు ఆందోళనకు ది గారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఆందోళన
బందనకల్‌లో రాస్తారోకో చేస్తున్న రైతులు

తంగళ్లపల్లి, మే 20: తంగళ్లపల్లి మం డలం లక్ష్మిపూర్‌లో కొనుగోలు కేంద్రంలో  ధాన్యం తూకంలో నిర్వాహకులు మోసా నికి పాల్పడ్డారని రైతులు ఆందోళనకు ది గారు.  పది రోజుల క్రితం లక్ష్మిపూర్‌లో సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారం భించారు. ఎలకా్ట్రనిక్‌ కాంటాతో ధా న్యాన్ని తూకం వేస్తూ కొనుగోలు చేస్తు న్నారు. తూకంలో తేడాలు వస్తున్నట్లు  కొంత మంది రైతులు గుర్తించారు. మరో కాంటా తెచ్చి తూకం వేయడంతో బ్యాగుకు కిలోన్నర తేడా వచ్చి ంది. దీంతో ఆందోళనకు దిగారు. కొనుగోళ్లను అడ్డుకొని నిర్వహకులపై అగ్రహం వ్యక్తం చేశారు.  విషయం తెలుసుకున్న ఫ్యాక్స్‌ చైర్మన్‌ బండి దేవ దాస్‌, సీఈవో నరేశ్‌ తూకంలో తేడాపై ఆరా తీశా రు. మిల్లులో దించుకున్న ధాన్యం ఎంత? అంశాల ను పరిశీలించి న్యాయం చేస్తామని ఫ్యాక్స్‌ చైర్మన్‌ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. 

ముస్తాబాద్‌ : ధాన్యం కొనుగోళ్ల జాప్యాన్ని నిరసిస్తూ మండలంలోని బందనకల్‌  రైతులు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి పదిహేను రోజులవుతున్నా  ఆలస్యమవుతుందని మండిపడ్డారు. వెంటవెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T06:33:57+05:30 IST