నెల్లూరులో జార్ఖండ్ వాసుల ఆందోళన

ABN , First Publish Date - 2021-11-24T21:54:20+05:30 IST

పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో ఝార్ఖండ్ వాసులు

నెల్లూరులో జార్ఖండ్ వాసుల ఆందోళన

నెల్లూరు: పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో జార్ఖండ్ వాసులు ఆందోళన చేశారు. రైల్వే స్టేషన్లో దాదాపు 1500 మందికి పైగా మహిళలు స్టేషన్లో ధర్నా నిర్వహించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారని కార్మికులను ఉన్నఫళంగా ఫాక్టరీ నుంచి తరిమేశాని ఆవేదన వ్యక్తం చేశారు. కోట మండలం కొత్తపట్టణం నుంచి కాలిబాటన నెల్లూరుకి జార్ఖండ్ కార్మికులు చేరుకున్నారు. కార్మికులకు మద్దతుగా సీఐటీయూ నిలిచింది. దీంతో పరిస్థితులను చక్కదిద్దడానికి  గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి రంగంలోకి దిగి కార్మికులు, యాజమాన్యంతో చర్చలు జరిపారు. సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో  కార్మికులు ఆందోళన విరమించారు. 




Updated Date - 2021-11-24T21:54:20+05:30 IST