APలో పదో తరగతి పరీక్షా ఫలితాల వాయిదాపై విద్యార్థి సంఘాల ఆందోళన

ABN , First Publish Date - 2022-06-04T18:11:02+05:30 IST

పదో తరగతి పరీక్షా ఫలితాల వాయిదాపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు.

APలో పదో తరగతి పరీక్షా ఫలితాల వాయిదాపై విద్యార్థి సంఘాల ఆందోళన

విజయవాడ: పదో తరగతి పరీక్షా ఫలితాల వాయిదాపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు కూడా ప్రణాళిక ప్రకారం విడుదల చేయలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. మంత్రి, అధికారుల మధ్య సమన్వయం లేదని ఫలితాలు వాయిదా వేయడం ఏమిటని ప్రశ్నించారు. ర్యాంకులు ప్రకటిస్తే.. జరిమానా అని‌ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇప్పుడు అర్ధంతరంగా ఫలితాలు వాయిదా వేశారని తెలిపారు. మరి అధికారులు, ప్రభుత్వానికి ఎటువంటి జరిమానా వేయాలని నిలదీశారు. ఆరు లక్షల మంది జీవితాలతో ఆడుకుంటారా... దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-06-04T18:11:02+05:30 IST