విత్తన ధరల పెంపుపై ఆందోళన

ABN , First Publish Date - 2021-11-30T05:13:27+05:30 IST

ఖరీఫ్‌లో వరి పంటను తీసిన వెంటనే సాగు చేయాల్సి న పెసలు, మినుములు, వేరుశనగ, మొక్కజొన్న విత్తనాల ధరల పెంపుపై రైతు లు ఆందోళన వ్యక్తం చేశారు.

విత్తన ధరల పెంపుపై ఆందోళన

లక్కవరపుకోట: ఖరీఫ్‌లో వరి పంటను తీసిన వెంటనే సాగు చేయాల్సి న పెసలు, మినుములు, వేరుశనగ, మొక్కజొన్న విత్తనాల ధరల పెంపుపై రైతు లు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కల్లేపల్లి రైతుభరోసా కేంద్రం లో విత్తనాలు తీసుకున్న రైతులు తమ సమస్యలను విలేకర్లతో చెప్పుకున్నా రు.  గత ఏడాది రూ.270 ఉన్న 4 కిలోల మినుములు బ్యాగు రూ.300కు పెంచా రని, రూ.290 ఉన్న 4 కిలోల పెసల బ్యాగు రూ.330 చేశారని, రూ.1,400 ఉన్న 30 కిలోల వేరుశనగ రూ.1610కి పెంచారని అసంతృప్తి వ్యక్తంచేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర మాత్రం లేదన్నారు.  

Updated Date - 2021-11-30T05:13:27+05:30 IST