శిఖపరువు మైనింగ్‌పై ఆందోళన

ABN , First Publish Date - 2020-11-22T05:17:13+05:30 IST

ఏవోబీలో శిఖపరువు వద్ద మాంగనీసు తవ్వకాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.

శిఖపరువు మైనింగ్‌పై ఆందోళన
గనుల ప్రాంతంలో తవ్వకాలు వద్దని నినాదాలు చేస్తున్న గిరిజనులు (ఫైల్‌)

 మళ్లీ తెరపైకి వచ్చిన గనుల తవ్వకాల వివాదం

సాలూరు రూరల్‌, నవంబరు 21: ఏవోబీలో శిఖపరువు వద్ద మాంగనీసు తవ్వకాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ గనుల తవ్వకాలకు నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 2012లో అనుమతులు మంజూరు చేసింది. గిరిజనుడి పేరుతో అనుమ తులిచ్చింది. ఈ తవ్వకాలను కొందరు పెద్దలు తెర వెనుక కథ నడిపిస్తున్నారని సీపీఎం, గిరిజనులు భగ్గుమంటున్నారు. గతంలో ఈ గనుల తవ్వకంపై రెండు సార్లు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా, గిరిజనులు వ్యతిరేకించారు. ఈ గనుల తవ్వకాలకు మళ్లీ కొందరు పెద్దలు పావులు కదపడంతో సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. గిరిజనులను ఒప్పించి గ్రామసభ ఆమోదానికి పావులు కదుపుతున్నారు. ఈ గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా ఇప్పటికే సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి పర్యటించి గిరిజనులకు అవగాహన కల్పించారు. పీసా చట్టం, 1/70 చట్టం, ఏపీ ఒడిశా వివాదం, అన్‌సర్వేయడ్‌ భూమిలో అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

అనుమతులు రద్దు చేయాలి

శిఖపరువు మైనింగ్‌ వల్ల గిరిజనుల జీవనానికి, 12 గిరిజన గ్రామాల అస్తిత్వానికి ముప్పు ఏర్పడుతుంది. ఈ అనుమతులను రద్దు చేయాలి.

- మర్రి శ్రీనివాసరావు,  శిఖపరువు మైనింగ్‌ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్‌ 

 

 

Updated Date - 2020-11-22T05:17:13+05:30 IST