ltrScrptTheme3

ఆందోళన బాట పట్టిన చౌకధాన్యపు డీలర్లు

Oct 27 2021 @ 00:20AM
రాయదుర్గంలో నిరసన తెలుపుతున్న స్టోర్‌ డీలర్లు

రాయదుర్గంటౌన, అక్టోబరు 26: డిమాండ్ల సాధన కోసం రేషన డీల ర్ల అసోసియేషన ఆధ్వర్యంలో మంగళవారం డీలర్లు ఆందోళన బాట చేపట్టారు. రేషన డీలర్ల అసోసియేషన గౌరవాధ్యక్షులు బండి కిష్టప్ప ఆధ్వర్యం లో పట్టణంలోని సివిల్‌ సప్లై స్టాకు పాయింట్‌ వద్ద స్టోర్‌ డీలర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మేకల శీన మాట్లాడారు. ఖాళీ గోనేసంచులు డీలర్లకే చెందాలని డిమాండ్‌ చేశారు. బకాయిపడిన ప్రధానమంత్రి అన్నయోజన, పీఎంజేకేవై కమీషన డీలర్ల ఖాతాలో జమ చేయాలని కోరారు. చౌకధాన్యపు డీలర్లకు ప్రభుత్వం భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చౌ కధాన్యపు డిపో డీలర్ల సంఘం ఉపాధ్యక్షులు మహేష్‌, కార్యదర్శి క్రిష్ణమూ ర్తి, సహాయ కార్యదర్శి దస్తగిరి, సభ్యులు తిప్పేస్వామి, ఇమామ్‌, రాజేష్‌, స త్తి పాల్గొన్నారు. 

 

గుత్తి: ప్రభుత్వ చౌకధాన్యపు డీలర్లు గోనె సంచులను వెనక్కు ఇవ్వాల ని ప్రభుత్వం తెచ్చిన నిబంధనను విరమించుకోవాలని డీలర్ల అసోసియేషన ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సివిల్‌ సప్లయ్‌ స్టాక్‌ పాయింట్‌ వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో అసోసియేషన అధ్యక్షుడు దాదు, కార్యదర్శి చంద్ర, ఉపాధ్యక్షుడు వలి, గౌరవ అధ్యక్షుడు నాగరాజు, డీలర్లు బలరాము డు, రంగన్న, రషీద్‌, పుల్లప్ప, రమేష్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

 

కంబదూరు: రేషన డీలర్ల సమస్యలు పరిష్కరించాలంటూ మండలం లోని రేషన డీలర్లు మంగళవారం ఆందోళన బాటపట్టారు. స్థానిక సివిల్‌ సప్లైయ్‌ గోదాము వద్ద  గోనెసంచులతో నిరసన చేపట్టారు. జీవోనెంబరు 10 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో కంబదూరు, కుందుర్పి మండలాలకు చెందిన స్టోర్‌ డీలర్లు లింగమూర్తి, ఫయాజ్‌, మల్లేషప్ప, రాజు, రాధాకృష్ణ, తిప్పయ్య, గంగన్న, పాలాక్షి పాల్గొన్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.