ఉపాధ్యాయుల ఆందోళనలు

ABN , First Publish Date - 2021-07-24T05:56:02+05:30 IST

ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని డోన్‌ మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణగౌడు, టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, ఫ్యాప్టో నాయకులు ఎన్‌ఎస్‌ బాబు, మాణిక్యం డిమాండ్‌ చేశారు.

ఉపాధ్యాయుల ఆందోళనలు
డోన్‌: సంఘీభావం తెలుపుతున్న టీడీపీ నాయకుడు మురళీకృష్ణగౌడు

డోన్‌, జూలై 23: ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని డోన్‌ మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణగౌడు, టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, ఫ్యాప్టో నాయకులు ఎన్‌ఎస్‌ బాబు, మాణిక్యం డిమాండ్‌ చేశారు. శుక్రవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. సీపీఐ కౌన్సిలర్‌ సుంకయ్య, సీఐటీయూ నాయకులు శివరాం, సీపీఎం, పలు ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల ధర్నాకు సంఘీభావం తెలిపాయి. నాయకులు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల విద్య నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో చేర్చి విద్యవ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. 11వ పీఆర్సీని అమలు చేయకుండా వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు.  ఎస్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు షన్మూర్తి, యూటీఎఫ్‌ రాష్ట్ర మాజీ గౌరవాధ్యక్షుడు నరసింహులు, ఫ్యాప్టో నాయకులు సుబ్బారెడ్డి, వెంకటరమణ, జానకీరాముడు, మద్దిలేటి, సుబ్బారాయుడు, బొజ్జన్న, శివప్రసాద్‌, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. 


డోన్‌(రూరల్‌): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌ అండగా ఉంటుందని కాంగ్రెస్‌ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గార్లపాటి మద్దిలేటి అన్నారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల సమస్యల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోలన కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు జనార్దన్‌ యాదవ్‌, సుబ్బు యాదవ్‌ పాల్గొన్నారు.


పత్తికొండరూరల్‌: ఉపాధ్యాయ సమస్యలపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఫ్యాప్టో  నాయకులు భాస్కర్‌, యోహోసువా, సత్యనారాయణ, పాండురంగారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని నాలుగు స్తంభాల కూడలిలో అన్ని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయ సంఘాల సమైఖ్య నాయకులు ప్రసాద్‌బాబు, రామమౌళి, మారుతి, సంద్యానాయక్‌, వేణు, పాండురంగ, రాఘవేంద్ర, ఎన్జీవో సంఘం నాయకులు సాయిబా, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-24T05:56:02+05:30 IST