ముగిసిన ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ టెన్నిస్‌ వాలీబాల్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-09-29T06:48:50+05:30 IST

ఇక్కడి ప్రతిభ విద్యాలయంలో మూడు రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ టెన్నిస్‌వాలీబాల్‌ పోటీలు బుధవారం ముగిశాయి.

ముగిసిన ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ టెన్నిస్‌ వాలీబాల్‌ పోటీలు
విజేతలతో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు

 సబ్బవరం, సెప్టెంబరు 28 : ఇక్కడి ప్రతిభ విద్యాలయంలో మూడు రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ టెన్నిస్‌వాలీబాల్‌ పోటీలు బుధవారం ముగిశాయి. ఈ పోటీల్లో బాలుర జూనియర్స్‌  విభాగంలో  ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలను విజయనగరం, చిత్తూరు, గుంటూరు జిల్లాల బాలికల జట్లు గెలుపొందాయి. అలాగే, సబ్‌ జూనియర్స్‌ బాలుర విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల జట్లు, బాలికల విభాగంలో   ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో పశ్చిమ గోదావరి, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల జట్లు నిలిచాయి. విజేతలకు అనకాపల్లి జిల్లా అడిషినల్‌ ఎస్పీ వి.సత్తిరాజు బహుమతులను ప్రదానం చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల తమిళనాడులోని తిరుచురాపల్లిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో కూడా క్రీడాకారులు రాణించాలని ఆకాంక్షించారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ సమన్వయ అధికారిణులు బి. చం ద్రావతి, ఎస్‌.రూపావతి, ప్రతిభ విద్యాలయం కరస్పాండెంట్‌ ఆదిరెడ్డి రమణ, ప్రిన్సిపాల్‌ జోసెఫ్‌, జిల్లా ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యులు ఉమా మహేష్‌, సీఎల్‌ఎన్‌ ప్రసాద్‌, ఎ.ఎస్‌.సుధాకర్‌, రమేష్‌బాబు పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-29T06:48:50+05:30 IST