కొత్త వేరియంట్ల పుట్టుకకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి: డబ్ల్యూహెచ్ఓ‌ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-02-20T03:04:50+05:30 IST

: కొత్త కరోనా వేరియంట్లు పుట్టుకు వచ్చేందుకు ప్రస్తుత పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ తాజాగా హెచ్చరించారు.

కొత్త వేరియంట్ల పుట్టుకకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి: డబ్ల్యూహెచ్ఓ‌ హెచ్చరిక

ఇంటర్నెట్ డెస్క్: కొత్త కరోనా వేరియంట్లు పుట్టుకు వచ్చేందుకు ప్రస్తుత పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ తాజాగా హెచ్చరించారు. ఈ కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా ఉండొచ్చని, వేగంగా వ్యాపించవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. ‘కరోనాను అంతం చేసే మార్గాలు’ అనే అంశంపై శుక్రవారం జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.  ఒమైక్రాన్ తీవ్రత తక్కువగా ఉండటం, అత్యధిక శాతం మంది టీకా తీసుకొని ఉండటం.. వెరసి కొన్ని దేశాల్లో కొవిడ్ సంక్షోభం ముగిసిందనే ప్రమాదకర అంచనాకు కారణమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


అయితే.. కరోనా సంక్షోభానికి ఈ ఏడాదిలోనే ముగింపు పలకొచ్చని, ఇందుకు కావాల్సిన ఉపాయాలు, సాధనాలు అందుబాటులో ఉన్నాయని కూడా తెలిపారు. కరోనా టీకాలు, టెస్టులు, చికిత్సా విధానాలు వంటివి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమై 16 బిలియన్ డాలర్ల నిధులు సమకూర్చాలంటూ వివిధ దేశాలను ఆయన అభ్యర్థించారు.

Updated Date - 2022-02-20T03:04:50+05:30 IST