మున్సిపల్‌ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించండి

ABN , First Publish Date - 2021-02-28T05:16:03+05:30 IST

కడప జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారని, అదే స్ఫూర్తితో మున్సిపల్‌ ఎన్నికలను కూడా నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సూచించారు.

మున్సిపల్‌ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించండి
తిరుపతిలో జరిగిన రాష్ట్ర ఎన్నికల కమిషన ప్రాంతీయ సమావేశానికి హాజరయిన కలెక్టర్‌ సి.హరికిరణ్‌, ఎస్పీ అన్బురాజన

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశకుమార్‌

తిరుపతిలో ప్రాంతీయ సమావేశం

హాజరైన కలెక్టర్‌ హరికిరణ్‌, ఎస్పీ అన్బురాజన

కడప, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారని, అదే స్ఫూర్తితో మున్సిపల్‌ ఎన్నికలను కూడా నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సూచించారు. శనివారం సాయంత్రం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్‌ హాలులో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్‌ కమిషనర్లతో ప్రాంతీయ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్‌ హరికిరణ్‌, ఎస్పీ కేకేఎన అన్బురాజన, మున్సిపల్‌ కమిషనర్‌ లవన్న హాజరయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని తప్పకుండా అమలయ్యేట్లు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ సూచించారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓట్లు వేసేలా చర్యలు చే పట్టాలన్నారు. ఎన్నికల కమిషన కార్యదర్శి కన్నబాబు, కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిసే్ట్రషన ఎంఎం నాయక్‌, అదనపు డీజీపీ సంజయ్‌, అనంతపురం డీఐజీ కాంతిరాణా టాటాలతో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఎన్నికల నిర్వహణ పట్ల చర్యలు, బందోబస్తు, భద్రతా చర్యలు, ఇతర అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన ద్వారా కలెక్టర్‌ హరికిరణ్‌, ఎస్పీ అన్బురాజనలు ఎన్నికల కమిషనరుకు వెల్లడించారు.


బందోబస్తులో వేరే సబ్‌డివిజన పోలీసులను నియమించండి

- టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి

జిల్లాలో జరగనున్న మున్సిపల్‌, కార్పొరేషన ఎన్నికలకు వేరే సబ్‌డివిజన పోలీసులను నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనను కోరామని టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి వెల్లడించారు. శనివారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశకుమార్‌ తిరుపతిలో రాయలసీమ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్‌ కమిషనర్లతో సమావేశం అనంతరం రాజకీయపార్టీల నాయకులతో వీడియో కాన్ఫరెన్సద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఎన్నికల కమిషనరుతో మాట్లాడిన విషయాలను లింగారెడ్డి మీడియాకు వెల్లడించారు. గత ఏడాది నామినేషన సందర్భంగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు వెల్లడించామన్నారు. కడపలోని 7వ డివిజన టీడీపీ అభ్యర్థి హేమలత నామినేషనలో తన భర్త ఆస్తులను చూపలేదని నామినేషనను తిరస్కరించారన్నారు. ఆస్తులను ఎప్పుడో అమ్ముకున్నారన్నారు. 41వ డివిజన అభ్యర్థిని వైసీపీ నేతలు బెదిరించారని ఆరోపించారు. నాలుగో డివిజన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యాటగిరి రాంప్రసాద్‌ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన వ్యక్తి సంతకాన్ని ఫోర్జరీ చేసి వితడ్రా చేశారన్నారు. 40వ డివిజన అభ్యర్థిగా శ్రీనివాసులు నామినేషన సందర్భంగా అన్ని పత్రాలు అందిస్తే కుల ధ్రువీకరణ పత్రంలేదని తిరస్కరించారన్నారు. రాయచోటిలో బెదిరించేసి 21వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారు. మైదుకూరులో టీడీపీ బలమైన అభ్యర్థులను పోటీకి దించిందని, వైసీపీ ప్రలోభాలకు లొంగకపోవడంతో పోలీసుల ద్వారా వత్తిళ్లు తెస్తున్నారన్నారు. కడపలో చిన్నచౌకు పోలీసులు కూడా నామినేషన వితడ్రా చేసుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నాన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను వేరే సబ్‌ డివిజన పోలీసులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్‌ కమిషనరు వైసీపీ తొత్తుగా మారారని, వేరే వారిని నియమించాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

Updated Date - 2021-02-28T05:16:03+05:30 IST