పకడ్బందీగా పది పరీక్షల నిర్వహణ

ABN , First Publish Date - 2022-05-26T05:40:43+05:30 IST

పదవ తరగతి పరీక్షలను జిల్లాలో ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ అన్నారు.

పకడ్బందీగా పది పరీక్షల నిర్వహణ
గర్రెపల్లిలో పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

- మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ 

- కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

సుల్తానాబాద్‌, మే 25: పదవ తరగతి పరీక్షలను జిల్లాలో ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ అన్నారు. మండలంవలోని గర్రెపల్లి మోడల్‌ స్కూల్‌లో ఏర్పాటుచేసిన పదవ తరగతి పరీక్షా కేం ద్రానికి కలెక్టర్‌ బుధవారం వచ్చారు. తరగతి గదులలో పరీక్ష లు రాస్తున్న విద్యార్థులను, పరీక్షల నిర్వహణ గురించి పరిశీ లించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 8163 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. వీరి కోసం జిల్లావ్యాప్తంగా 49 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారని, జిల్లాలోని ఓ సీనియర్‌ అధికారి ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద ఇన్‌జార్జీగా ఉంటారని, పరీక్షలు పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతున్నాయన్నారు. మాస్‌ కాపీ యింగ్‌ నియంత్రించేందుకు ప్రతీకేంద్రం వద్ద సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేశామన్నారు. అలాగే సీనియర్‌ అధికారులతో కూడి న ఫ్లైయింగ్‌ స్వ్కాడ్‌ల బృందాలను కూడా ఏర్పాటు చేశా మన్నారు. పరీక్షలు రాసేందుకు వస్తున్న విద్యార్థుల కోసం తాగునీటి వసతిని ఏర్పాటు చేయాలని అదేశించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ గ్రామంలో ఒక క్రీడా ప్రాం గణాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశం మేరకు కలెక్టర్‌ బుధవారం గర్రెపల్లి ఎకరంన్నర ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. గ్రామీణ ప్రాంతా లలో క్రీడలను నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు జిల్లాలోని అన్ని గ్రామాలలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ మేరకు గర్రెపల్లి మోడల్‌ స్కూల్‌ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అధికారులు ఎంపిక చేయగా, బుధవారం స్థలాన్ని కలెక్టర్‌ పరిశీలించి పలు సలహాలు సూచ లు చేశారు. ఈ స్థలంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ తదితర క్రీడల నిర్వహణతో పాటు యువత వ్యాయామం చేయడానికి ఒక ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గర్రెపల్లితో పాటు మరో రెండు గ్రామాలలో ప్రస్తుతం ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేశారు. ఈ క్రీడా ప్రాంగణాలను రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ యాకన్న, ఎంపీడీఓ శశికళ, ఈజీఎస్‌ ఏపీఓ లావణ్య తదితర అధికారులున్నారు. 

Updated Date - 2022-05-26T05:40:43+05:30 IST