పుట్టుకతో వచ్చే వెన్ను అవకరాలపై సదస్సు నేడు

ABN , First Publish Date - 2022-08-10T06:23:08+05:30 IST

ఆంధ్ర మెడికల్‌ కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏడాది పొడవునా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా పుట్టుకతో వచ్చే వెన్ను అవకరాలపై అవగాహన సదస్సును బుధవారం నిర్వహిస్తున్నట్టు ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.బుచ్చిరాజు తెలిపారు.

పుట్టుకతో వచ్చే వెన్ను అవకరాలపై సదస్సు నేడు
సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర మెడికల్‌ కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏడాది పొడవునా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా పుట్టుకతో వచ్చే వెన్ను అవకరాలపై అవగాహన సదస్సును బుధవారం నిర్వహిస్తున్నట్టు ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.బుచ్చిరాజు తెలిపారు. మంగళవారం ఉదయం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుధవారం జరిగే సదస్సులో పలువురు వైద్య నిపుణులు పాల్గొంటారన్నారు. ఫ్లోరిడాకు చెందిన పిడియాట్రిక్‌ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ జోగి వి పట్టిశాపు మాట్లాడుతూ పుట్టుకతో వచ్చే వెన్ను అవకారాలను నివారించేందుకు అవకాశం వుందని, దీనిపై సదస్సులో విపులంగా తెలియజేస్తామన్నారు. రంగరాయ కళాశాల న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ ఎంవీ విజయ్‌శేఖర్‌ మాట్లాడుతూ శతాబ్ది వేడుకల్లో భాగంగానే ఈ నెల 14న న్యూరోట్రామా-22 పేరుతో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఆ రోజు ఉదయం ఆరు గంటలకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాక్‌థాన్‌ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఈ నెల 13న న్యూరోనర్సెస్‌ కాన్‌-2022 పేరుతో సదస్సును నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2022-08-10T06:23:08+05:30 IST