జమ్మలమడుగు మండలంలో ఘర్షణ

ABN , First Publish Date - 2021-01-25T13:59:31+05:30 IST

జిల్లాలోని జమ్మలమడుగు మండలం గండికోటలో అర్థరాత్రి ఘర్షణ జరిగింది. రమేష్ అనే యువకుడి పుట్టిన

జమ్మలమడుగు మండలంలో ఘర్షణ

కడప : జిల్లాలోని జమ్మలమడుగు మండలం గండికోటలో అర్థరాత్రి ఘర్షణ జరిగింది. రమేష్ అనే యువకుడి పుట్టిన రోజు వేడుకలలో యువకుల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో జమ్మలమడుగు, మొరగుడి యువకుల మధ్య వివాదం చెలరేగింది. ఈ  ఘర్షణలో దేవారాజుకి  సంబంధించిన బైక్ ను రమేష్, అతని స్నేహితులు దగ్ధం చేశారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-25T13:59:31+05:30 IST