ఇసుక పోసి.. శాపనార్థాలు!

ABN , First Publish Date - 2021-08-06T09:17:15+05:30 IST

విశాఖపట్నం జిల్లా దేవదాయ శాఖలో అధికారుల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇక్కడ డిప్యూటీ కమిషనర్‌ (డీసీ) పుష్పవర్థన్‌కు, అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ)

ఇసుక పోసి.. శాపనార్థాలు!

దేవదాయ శాఖ ఏసీ గీడీసీ 


విశాఖపట్నం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా దేవదాయ శాఖలో అధికారుల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇక్కడ డిప్యూటీ కమిషనర్‌ (డీసీ) పుష్పవర్థన్‌కు, అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ) శాంతికి కొద్దికాలంగా పొసగడం లేదు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం డీసీ తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశంలో ఉండగా.. ఏసీ శాంతి హఠాత్తుగా చాంబర్‌లోకి ప్రవేశించి, చేతితో తెచ్చిన ఇసుకను ఆయన ముఖంపై విసిరి దుర్భాషలాడారు. ఆయన తనను వేధిస్తున్నారని ఆరోపించారు.ఈ హఠాత్పరిణామానికి డీసీతో సహా అక్కడున్న అధికారులంతా విస్తుపోయారు. దీనిపై డీసీ పుష్పవర్థన్‌ మాట్లాడుతూ.. తాను డీసీగా బాధ్యతలు చేపట్టి నెల రోజులే అయిందని, గత నెల 14 తర్వాత గురువారమే మళ్లీ ఆఫీ్‌సకు వచ్చానని వివరించారు. ఆమెకు, తనకు ఎటువంటి విభేదాలు లేవన్నారు. 

Updated Date - 2021-08-06T09:17:15+05:30 IST