భగ్గుమన్న విభేదాలు

Sep 25 2021 @ 00:44AM
సభలో వాగ్వాదానికి దిగిన వైసీపీ ఎంపీటీసీ సభ్యులు

గుమ్మఘట్ట, సెప్టెంబరు 24: మండల పరిషత కా ర్యాలయంలో శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికలో అధికార వైసీపీ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.   ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్‌ కావడంతో కలుగో డు-2 ఎంపీటీసీ ఓబుళ కాంతమ్మ, తాళ్లకెర-1 ఎంపీటీసీ  గౌరమ్మ, పూలకుంట ఎంపీటీసీ భవాని.. ఎస్సీ మహిళలు అధికార పార్టీ తరపున గెలుపొందారు. మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు వుండగా, శుక్రవారం ఎంపీపీ ఎన్నిక, ప్రమాణస్వీకారోత్సవానికి 13 మంది ఎంపీటీసీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. కలుగోడు-1 ఎంపీటీసీ సభ్యురా లు ఓబుళకాంతమ్మ ఎంపీపీ ఎన్నికకు గైర్హాజరైంది. తన కు ఎంపీపీ పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురైన ఆమె సమావేశానికి గైర్హాజరైంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమయ్యా యి. మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు పంపకాల్లో స మన్యాయం లేకపోవడంతో అసంతృప్తికి గురైన తాళ్లకెర, రంగసముద్రం, గలగల, కలుగోడు ఎంపీటీసీ సభ్యులు మధ్యాహ్నం వరకు హాజరుకాలేదు. దీంతో చివరకు వైసీ పీ కన్వీనర్‌ లక్ష్మీకాంతరెడ్డి జోక్యం చేసుకుని అసంతృప్తుల ను బుజ్జగించి సమావేశానికి హాజరుపరిచారు. మధ్యా హ్నం జరిగిన సమావేశంలో కోఆప్షన సభ్యుడిగా నేత్రపల్లి ఇదయతుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంత రం ఎంపీపీగా పూలకుంట ఎంపీటీసీ సభ్యురాలు భవాని, ఉపాధ్యక్షురాలిగా శిరిగేదొడ్డి సభ్యురాలు జయమ్మను ఎ న్నుకున్నారు. ఎన్నికల అధికారి ప్రభావతి, ఎంపీడీవో శివరామ్‌ ప్రసాద్‌ రెడ్డి, తహసీల్దార్‌ వెంకటచలపతి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. 


సన్మానం తెచ్చిన తంటా..

కాగా మండల అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు ఎంపిక తరువాత సభ్యుల సన్మాన కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్‌ గౌని లక్ష్మీకాంతరెడ్డి, జడ్పీటీసీ పీఎస్‌ మహేష్‌ మధ్య వా గ్వాదం చోటుచేసుకుంది. తొలుత కన్వీనర్‌ సభ్యులకు శా లువాలు, పూలమాలలతో సత్కరిస్తుండగా.. జడ్పీటీసీ  అ సహనానికి గురై అంతాతానై వ్యవహరిస్తున్నావంటూ ఒ కింత ఆగ్రహంతో కన్వీనర్‌పై వాగ్విదానికి దిగారు. అంత లో అక్కడి నాయకులు, పోలీసులు సర్దిచెప్పగానే అక్కడి నుంచి జడ్పీటీసీ సభ్యుడు మహేష్‌ వెళ్లిపోయారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.