‘పది’ పరీక్షలపై అయోమయం

ABN , First Publish Date - 2021-05-21T05:25:36+05:30 IST

కరోనా ఉధృతి నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై అయోమయం నెలకొంది. కరోనా తీవత్ర కారణంగా కొన్ని రాష్ర్టాలు పది, ఇంటర్‌ పరీక్షలు, సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దుచేశాయి. దీంతో రాష్ట్రంలో కూడా పదో తరగతి పరీక్షలు రద్దుచేయాలని ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలను జూన్‌ నాటికి వాయిదా వేసింది. ఇంటర్‌ పరీక్షలు కూడా వాయిదా వేసింది. ఇప్పటికీ కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు కోరుతున్నారు.

‘పది’ పరీక్షలపై అయోమయం

 సిద్ధంగా ఉండాలంటున్న అధికారులు

 రద్దు చేయాలంటున్న తల్లిదండ్రులు

ఇచ్ఛాపురం: కరోనా ఉధృతి నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై అయోమయం నెలకొంది. కరోనా తీవత్ర కారణంగా కొన్ని రాష్ర్టాలు పది, ఇంటర్‌ పరీక్షలు, సీబీఎస్‌ఈ  12వ తరగతి పరీక్షలు రద్దుచేశాయి. దీంతో రాష్ట్రంలో కూడా పదో తరగతి పరీక్షలు రద్దుచేయాలని ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం  పరీక్షలను జూన్‌ నాటికి వాయిదా వేసింది. ఇంటర్‌ పరీక్షలు కూడా వాయిదా వేసింది. ఇప్పటికీ కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితులోనూ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో సందిగ్ధం నెలకొంది. జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో 32 వేల మందికిపైగా పదో తరగతి విద్యార్థులు, 48 వేలకుపైగా ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలు పరీక్షలు రాయాల్సి ఉంది. ఈనెల ఐదో తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిన విషయం విదితమే. కోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా వేశారు. తేదీలను త్వరలో ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. పరీక్షల కంటే పిల్లల ప్రాణాలే ముఖ్యమని, కావాలంటే వచ్చే ఏడాది పరీక్షలు రాయించాలని తల్లిదండ్రులు కూడా తెగేసి చెబుతున్నారు. విద్యార్థి, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు సైతం పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీనిపై ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. 

 షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు 

సెలవుల నేపధ్యంలో విద్యార్థులు ఇళ్ల వద్ద ఉండి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. జూన్‌లో షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించేలా వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ఉపాధ్యాయులతో పర్యవేక్షిస్తున్నాం. మాదిరి ప్రశ్నపత్రాలు పంపి, వారిని సన్నద్ధం చేస్తున్నాం.  

   -  కె.వాసుదేవరావు, ఉప విద్యాశాఖాధికారి, టెక్కలి

Updated Date - 2021-05-21T05:25:36+05:30 IST