హైదరాబాద్‌లో ఎంపీని కలిసిన మిరుదొడ్డి మండల ప్రజాప్రతినిధులు
సమాచారం ఇవ్వకుండానే నియమించారని సర్పంచుల ఆరోపణ
మిరుదొడ్డి, జనవరి 24: సర్పంచులకు సమాచారం ఇవ్వకుండానే మిరుదొడ్డి వ్యవసాయ పాలకమండలి సభ్యులను ఎంపీపీ, జడ్పీటీసీల భర్తలు నియమించారని మండలానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు ఆరోపించారు. ఆదివారం ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిపి మండలంలో జరుగుతున్న పరిస్థితిని వివరించారు. గ్రామంలో ఏదైనా నామినేటేడ్ పదవి కేటాయింపు జరిగితే సర్పంచ్, ఎంపీటీసీలతో సంప్రదింపులు జరుపాలి. కానీ తమకు సమాచారం ఇవ్వకుండానే గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలిలో డైరెక్టర్లను నియమించారని సర్పంచులు, ఎంపీటీసీలు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీపీ, జడ్పీటీసీల భర్తల అత్యుత్సాహంతో ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎంపీ.. సర్పంచులకు సమాచారం లేకుండా నియమించిన వ్యవసాయ పాలక మండలి డైరెక్టర్లను తొలగించాలని హుకూం జారిచేసినట్లు సమాచారం.