ఒకరి తర్వాత మరొకరు ప్రపోజ్ చేసిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. మరి ఈ కుర్రాడి నిర్ణయమేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-03-05T23:16:24+05:30 IST

ముగ్గురు అక్కాచెలెళ్లు.. నిమిషాల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు భూమి మీదకు వచ్చారు. ఏళ్లు గడిచే కొద్దీ పెరిగి పెద్దయ్యారు. ఈ క్రమంలోనే ముగ్గరు అక్కాచెల్లెళ్లూ.. ఓ వ్యక్తిపై మనసు పడ్డారు. అంతేకాకుండా

ఒకరి తర్వాత మరొకరు ప్రపోజ్ చేసిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. మరి ఈ కుర్రాడి నిర్ణయమేంటో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ముగ్గురు అక్కాచెలెళ్లు.. నిమిషాల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు భూమి మీదకు వచ్చారు. ఏళ్లు గడిచే కొద్దీ పెరిగి పెద్దయ్యారు. ఈ క్రమంలోనే ముగ్గరు అక్కాచెల్లెళ్లూ.. ఓ వ్యక్తిపై మనసు పడ్డారు. అంతేకాకుండా ఒకరి తర్వాత ఒకరు వెళ్లి అతడికి తమ ప్రేమను వ్యక్తపర్చారు. దీంతో ఒక్కసారిగా అతడు షాకయ్యాడు. ఆ తర్వాత అతడు ఏం నిర్ణయం తీసుకున్నాడనే వివరాల్లోకి వెళితే..


కాంగోకు చెందిన నడిగే, నటాషా, నటాలీ అనే అక్కాచెల్లళ్లు ముగ్గురూ.. లువిజా అనే యువకుడిని ఇష్టపడ్డారు. అంతేకాకుండా అతడి వద్దకు వెళ్లి తమ ప్రేమ విషయాన్ని ఒకరి తర్వాత ఒకరు వ్యక్త పరిచారు. అది విని లువిజా ఒక్కసారిగా షాకయ్యాడు. వారి ప్రేమ విషయంపై సుదీర్ఘంగా ఆలోచించాడు. ఆ తర్వాత ముగ్గురి ప్రేమను అంగీకరించాడు. కొద్ది రోజులుగా ప్రేమలో మునిగి తేలిన తర్వాత తమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అమ్మాయిల తల్లిదండ్రులు వారి పెళ్లికి ఓకే చెప్పారు. కానీ లువిజా తల్లిదండ్రులు మాత్రం దానికి అంగీకరించలేదు. 



అయితే తల్లిదండ్రుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోని లువిజా.. తాజాగా ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఒకేరోజు నిమిషాల వ్యవధిలోనే పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశాడు. లోతుగా ఆలోంచించిన తర్వాత పెళ్లి నిర్ణయంపై ముందడుగు వేసినట్టు చెప్పాడు. ప్రేమకు పరిధి ఉండదన్నారు. ఈ నిర్ణయం తన తల్లిదండ్రులకు నచ్చలేదని తెలిపాడు. అందుకే పెళ్లికి వాళ్లు రాలేదన్నాడు. అయితే ఒకటి కావాలనుకుంటే మరొకటి కోల్పోక తప్పదని వ్యాఖ్యానించాడు. నిమిషాల వ్యవధిలో జన్మించిన సొంత అక్కాచెల్లెళ్లు.. ఒకే వ్యక్తిని ప్రేమించి.. ఒకే సమయానికి పెళ్లి చేసుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతిస్తుండటం విశేషం.




Updated Date - 2022-03-05T23:16:24+05:30 IST