
న్యూఢిల్లీ : దేశంలో కేంద్రం తీసుకువచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు సంతోషం వ్యక్తం చేశారు.‘‘అహంకారం ఓడిపోయింది, అన్యాయానికి వ్యతిరేకంగా రైతులు పోరాడి విజయం సాధించినందుకు అభినందనలు’’ అని రాహుల్ గాంధీ మూడు వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయంపై శుక్రవారం ట్వీట్ చేశారు.మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రైతులకు అభినందనలు తెలిపారు.
‘‘మీ పట్ల ప్రవర్తించిన క్రూరత్వానికి చలించకుండా అవిశ్రాంతంగా పోరాడిన ప్రతి ఒక్క రైతుకు నా హృదయపూర్వక అభినందనలు. ఇది మీ విజయం.. ఈ పోరాటంలో మరణించిన రైతుల నా ప్రగాఢ సానుభూతి’’ అని మమతాబెనర్జీ ట్వీట్ చేశారు.మొత్తంమీద సాగు చట్టాల రద్దుపై దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలు సంతోషం వ్యక్తం చేస్తూ రైతులను అభినందించారు.