విద్యార్థులకు మంత్రి, కలెక్టర్‌ అభినందన

ABN , First Publish Date - 2022-06-30T04:53:12+05:30 IST

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాం కులు సాధించిన స్కాలర్‌, అభ్యాస్‌ కళాశాలల విద్యార్థులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభినందించారు.

విద్యార్థులకు మంత్రి, కలెక్టర్‌ అభినందన
ప్రతిభ కనబరిచిన అభ్యాస్‌ కళాశాల విద్యార్థులతో మంత్రి నిరంజన్‌రెడ్డి


వనపర్తి రూరల్‌, జూన్‌ 29: ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాం కులు సాధించిన స్కాలర్‌, అభ్యాస్‌ కళాశాలల విద్యార్థులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభినందించారు. బుధవారం పట్ట ణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మం త్రిని ఆయా కళాశాలల యాజమాన్య సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనపర్తి కీర్తి ప్రతిష్టలను నలుదిక్కుల వ్యాప్తి చేయాలని, జీవితంలో ఉన్నత స్థానాలను అధి రోహించి సమాజ సేవ  చేయాలని, తల్లిదండ్రు లను, గురువులను గౌరవించాలని ఆయన కోరా రు. కార్యక్రమంలో స్కాలర్‌ కళాశాల యాజ మాన్య సభ్యులు జగదీశ్వర్‌, వరప్రసాద్‌రావు, నా గేశ్వర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌, మధుసూదన్‌గుప్త, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. 

అదేవిధంగా, రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధిం చిన అభ్యాస్‌ కళాశాల విద్యార్థులను మంత్రి ని రంజన్‌రెడ్డి శాలువాలతో సత్కరించి, అభినందిం చారు. కార్యక్రమంలో అభ్యాస్‌ కళాశాల చైర్మన్‌ జ్ఞానేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ ముజామిల్‌, తదితరులు పాల్గొన్నారు.  

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో రావూస్‌ కళా శాల విద్యార్థులను కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి జాకీర్‌హుస్సేన్‌ అభినందించారు. విద్యార్థులు బాగా చదువుకోవా లని వారు సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ పీవీఎస్‌ఎన్‌.ప్రసాద్‌, యాజమాన్య సభ్యులు శ్రీనివాస్‌, రామ్‌కుమార్‌, శ్రీనివాసులు, అమరేందర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.  





Updated Date - 2022-06-30T04:53:12+05:30 IST