కాంగ్రెస్ అభ్యర్థి సోనూసూద్ సోదరి మాళవిక సూద్ వెనుకంజ

ABN , First Publish Date - 2022-03-10T16:21:02+05:30 IST

పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సోనూసూద్ సోదరి మాళవిక సూద్ వెనుకంజలో ఉన్నారు...

కాంగ్రెస్ అభ్యర్థి సోనూసూద్ సోదరి మాళవిక సూద్ వెనుకంజ

చండీఘడ్ (పంజాబ్): పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సోనూసూద్ సోదరి మాళవిక సూద్ వెనుకంజలో ఉన్నారు. తన ప్రత్యర్థి అభ్యర్థి కంటే మాళవిక వెనుకబడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన సోనూసూద్ సోదరే ఓటమి దిశగా పయనిస్తుండటం విశేషం. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోగా పట్టణంలోని తన నివాసంలో కాంగ్రెస్ అధినేత నవజోత్ సింగ్ సిద్దూ, సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోనుసూద్ సోదరి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పంజాబ్ ఎన్నికల కమిషన్ తన ప్రచారకర్తగా సోనుసూద్ నియమకాన్ని ఉపసంహరించుకుంది.


Updated Date - 2022-03-10T16:21:02+05:30 IST