9న కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు

ABN , First Publish Date - 2021-12-07T23:19:44+05:30 IST

రాష్ట్రంలో ఈ నెల 9న కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ

9న కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు

హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 9న కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభిస్తామని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 30 లక్షల సభ్యత్వం నమోదు చేయడమే టార్గెట్‌గా పనిచేస్తున్నామన్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌లు విమర్శించుకుని వరి రైతుల సమస్యను పక్కన పెట్టాయన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తుందన్నారు. ఆఖరి వడ్ల  గింజ వరకు కొనుగోలు చేసి కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం వరి ధాన్యానికి బోనస్ ఇవ్వడమే కాకుండా, ప్రత్యామ్నాయ పంటలు వేస్తే మద్దతు ధర కల్పిస్తుందన్నారు. ఛత్తీస్‌గడ్‌లో టీపీసీసీ టీం పర్యటిస్తుందన్నారు. కోవిడ్ కారణంగా ఢిల్లీలో చేపట్టాల్సిన నిరసనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. 



Updated Date - 2021-12-07T23:19:44+05:30 IST