కుటుంబ పోరుతోనే బ్రేక్‌!

ABN , First Publish Date - 2022-04-28T08:16:33+05:30 IST

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రె్‌సలో చేరకపోవడానికి గాం ధీ కుటుంబంలో అంతర్గత పోరు, పార్టీ నేతల కుతంత్రాలే కారణమా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గా లు. కాంగ్రెస్‌ పార్టీని నడిపించడంపై రాహుల్‌, ప్రి యాంకల మధ్య భేదాభిప్రాయాలున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

కుటుంబ పోరుతోనే బ్రేక్‌!

కాంగ్రెస్‌కు పీకే దూరంకావడానికి ఇదే కారణం?

రాహుల్‌ ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు ప్రియాంక 

వ్యూహం.. పీకే ప్రతిపాదనల వెనుక ఆమెనే

పార్టీ చీఫ్‌గా ప్రియాంక, పార్లమెంట్‌ బోర్డుకు రాహుల్‌

ప్రతిపాదించిన రాజకీయ వ్యూహకర్త

పీకే రాకను అడ్డుకున్న రాహుల్‌ వర్గీయులు

సోనియా అండతో రాహుల్‌కు అనుకూల పరిణామాలు

పార్టీ తలుపులు తెరిచే ఉంటాయన్న కాంగ్రెస్‌ 

కాంగ్రెస్‌ చీఫ్‌గా ప్రియాంక, పార్లమెంట్‌ బోర్డుకు రాహుల్‌.. పీకే ప్రతిపాదన

పీకేను అడ్డుకున్న రాహుల్‌ వర్గీయులు

అందుకే ప్రశాంత్‌ కిశోర్‌ దూరం?


న్యూఢిల్లీ, ఏప్రిల్‌27(ఆంధ్రజ్యోతి):రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రె్‌సలో చేరకపోవడానికి గాం ధీ కుటుంబంలో అంతర్గత పోరు, పార్టీ నేతల కుతంత్రాలే కారణమా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గా లు. కాంగ్రెస్‌ పార్టీని నడిపించడంపై రాహుల్‌, ప్రి యాంకల మధ్య భేదాభిప్రాయాలున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రి యాంక వాద్రా ద్వారా కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని పీకే భావించారు. ప్రియాంక ఒత్తిడి మేరకే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ నేతలతో ఆయన సమావే శాన్ని ఏర్పాటు చేశారు. తొలి రోజు సమావేశంలో పాల్గొన్న తర్వాత రాహుల్‌ గాంధీ విదేశాలకు వెళ్లిపోయారు.

పీకే నియామకం జరగదని తేలడంతో ప్రి యాంక కూడా విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. రాహుల్‌ ప్రాధాన్యతను తగ్గించేందుకు పీకే చేసిన ప్ర తిపాదనల వెనక ప్రియాంక హస్తం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీపై పట్టు సాధించేందుకే పీకే ద్వారా ఆమె పావులు కదిపారు. ఒక దశలో ప్రియాంకను పార్టీ అధ్యక్షురాలు చేయాలని కూడా పీకే సూచించారని, కానిపక్షంలో సోనియాగాంధీని అధ్యక్షురాలిగా కొనసాగిస్తూ మరొకరిని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేయాలని, రాహుల్‌ను పార్లమెంటరీ బోర్డుకే పరిమితం చేయాలని చెప్పారని తెలుస్తోంది.

కాగా, పార్టీ అధ్యక్ష పదవిని నిరాకరించిన తర్వాతా రాహుల్‌ పార్టీలో చక్రం తిప్పడం, తన అనుయాయుల ద్వారా రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకోవడం ప్రియాంకకు ఇష్టం లేదని చెబుతున్నారు. పార్టీలో నాయకత్వ సమస్యను పరిష్కరించాలని ఆమె కోరినట్టు తెలుస్తోంది. కొందరు జీ-23 నేతల అసంతృప్తి వెనుక ప్రియాంక హస్తం ఉం దని సమాచారం. 


విదేశాల నుంచే చక్రం తిప్పిన రాహుల్‌

రాహుల్‌ విదేశాల నుంచే చక్రం తిప్పారని, పీకేను అడ్డుకోవడానికి ఆయన అనుయాయులు క్రియాశీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. పీకే రాకను జైరాం రమేశ్‌, దిగ్విజయ్‌ సింగ్‌, అశోక్‌ గెహ్లోత్‌ తదితరులు పార్టీ అంతర్గత సమావేశంలో గట్టిగా వ్యతిరేకించారు. నేతలతో సోనియాగాంధీ చర్చిస్తున్నప్పుడే పార్టీ ప్రధా న కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సూచన మేరకు పీకే కు వ్యతిరేకంగా పార్టీ కార్యదర్శి మాణిక్కం ఠాగూర్‌ ట్వీట్‌ చేశారని తెలుస్తోంది. చివరకు సోనియా నియమించిన సీనియర్‌ నేతల కమిటీ కూడా ప్రశాంత్‌ కిశోర్‌కు ఒక కమిటీలో సాధారణ సభ్యుడిగా అవకాశం కల్పించాలని సూచించడం తో రాహుల్‌ వర్గీయులు పీకేను పొమ్మనకుండానే పొగపెట్టారని తెలుస్తోంది. కాంగ్రె్‌సలో అన్నాచెల్లెల్ల మధ్య అభిప్రాయ భేదాలు ప్రశాంత్‌ కిశోర్‌ మూలంగా తారా స్థాయికి చేరుకున్నాయని, సోనియా పుత్రప్రేమ వల్ల రాహుల్‌కు పరిస్థితులు అనుకూలంగా మారాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాహుల్‌కు పార్టీపై పట్టున్నంత కాలం కాంగ్రెస్‌లో తనకు స్వేచ్ఛ ఉండదని గ్రహించిన తర్వాతే పీకే తప్పుకున్నారు.  


పార్టీ తలుపులు తెరిచే ఉంటాయి!

కాంగ్రె్‌సలో చేరబోనని పీకే ప్రకటించిన మరుసటిరోజే పార్టీలో చేరాలనుకునే వారికి కాంగ్రెస్‌ తలుపులు తెరిచే ఉంటాయని ఆ పార్టీ ప్రకటించింది. దీంతో పార్టీ లో పీకే మళ్లీ చేరతారా? అన్న ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. 


సలహాదారు ఉన్నా.. లేకున్నా పార్టీ కుదుటపడుతుంది: దిగ్విజయ్‌ 

సాధికార కార్యాచరణ బృందం-2024లో చేరాలన్న తమ ఆహ్వానాన్ని పీకే తిరస్కరించారని ప్రధాన కార్యదర్శి సూర్జేవాలా చెప్పారు. సలహాదారు ఉన్నా లేకపోయినా కాంగ్రెస్‌ పార్టీ తన సంస్థను చక్కదిద్దుకుంటుందని మరో సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పష్టం చేశారు, ఏమైనా రాహుల్‌ సారథ్యంలో కాంగ్రెస్‌ భవిష్యత్‌ మెరుగుపడుతుందా, ఇప్పటికైనా ఆయన పార్టీ పగ్గాలు చేపట్టి క్రియాశీలకంగా పనిచేస్తారా అన్న అనుమానాలు పార్టీ నేతల్లో పెరిగాయి. 


కాంగ్రెస్‌ లేకుండా కేంద్రంలో అధికారమార్పిడి సాధ్యంకాదు: ఏకే ఆంటోనీ

కాంగ్రెస్‌ కీలకపాత్ర పోషించకుండా కేంద్రంలో అధికారమార్పిడి సాధ్యంకాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ పార్టీకి నెహ్రూ-గాంధీ కుటుంబమే అధికారకేంద్రమని, మార్గదర్శి అని ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆ కుటుంబం లేని కాంగ్రె్‌సను దేశంలోని 99 శాతం మంది కార్యకర్తలకు ఆమోదయోగ్యం కాబోదని చెప్పారు. ‘‘కాంగ్రె్‌సను తక్కువగా అంచనా  వేయొద్దు. మళ్లీ మేం అధికారంలోకి వస్తాం’’ అని ఆంటోనీ వివరించారు.   


హరియాణా కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉదయ్‌ భాన్‌

హరియాణా కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉదయ్‌ భాన్‌ నియమితులయ్యారు. కుమారి సెల్జా స్థానంలో మాజీ సీఎం భూపిందర్‌ సింగ్‌ హుడా విధేయుడైన ఉదయ్‌ను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా మరో నలుగురిని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా నియమించినట్టు పేర్కొన్నారు.

Updated Date - 2022-04-28T08:16:33+05:30 IST