Congress: రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం తర్జన భర్జన

ABN , First Publish Date - 2022-08-01T16:47:21+05:30 IST

రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది.

Congress: రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం తర్జన భర్జన

హైదరాబాద్ (Hyderabad): కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. రాజగోపాల్ రెడ్డితో జరిపిన చర్చల సారాంశాన్ని సోమవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), వంశీ చంద్ రెడ్డి (Vamsi Chand Reddy) ఢిల్లీ (Delhi) పెద్దలకు వివరించనున్నారు. చర్చల కోసం ఢిల్లీకి రావాలన్న ఏఐసీసీ (AICC) దూతల ఆహ్వానాన్ని  రాజగోపాల్ రెడ్డి తిరస్కరించారు. 


కాగా రాజగోపాల్ రెడ్డి విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు (Congress leaders) రెండు వర్గాలుగా విడిపోయారు. ఆయనను పార్టీ మారకుండా ఆపే ప్రయత్నం చేయాలని సీనియర్ నేతలు అంటున్నారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మరికొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి తీరు పార్టీకి నష్టం చేస్తుందని మండిపడుతున్నారు. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే తొందరపడొద్దని మరి కొందరు సీనియర్లు వారిస్తూ.. సర్ది చెప్పాలని సూచిస్తున్నారు. సీనియర్ల సలహాతో చర్యలపై ఆచి తూచి కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకునే వరకు వేచి చూసే ధోరణిలో అధిష్టానం ఉంది.

Updated Date - 2022-08-01T16:47:21+05:30 IST