కాంగ్రెస్ కేవలం అన్నాచెల్లెళ్ల పార్టీ: జేపీ నడ్డా

ABN , First Publish Date - 2022-04-30T01:01:25+05:30 IST

కాంగ్రెస్ ఇక ఎంతో కాలం జాతీయ పార్టీగా ఉండదు. ఎందుకంటే ఆ పార్టీ కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. తొందర్లో ఆ రాష్ట్రాలను కూడా కోల్పోతుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రె్ పార్టీ ఇండియన్ కాదు. అది జాతీయ పార్టీ కాదు..

కాంగ్రెస్ కేవలం అన్నాచెల్లెళ్ల పార్టీ: జేపీ నడ్డా

అహ్మదాబాద్: కాంగ్రెస్ ఇంకెంత మాత్రం జాతీయ పార్టీగా ఉండబోదని, ఆ పార్టీ కేవలం అన్నాచెల్లెళ్ల పార్టీ అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శించారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా శుక్రవారం అహ్మదాబాద్‌లో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలోని అన్ని పార్టీలు కుటుంబ, వారసత్వ పార్టీలు అయ్యాయని విమర్శించారు. బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీయని, కాంగ్రెస్ కొద్ది రోజుల్లోనే ఆ స్థానాన్ని కోల్పోనుందని ఆయన జోస్యం చెప్పారు.


‘‘కాంగ్రెస్ ఇక ఎంతో కాలం జాతీయ పార్టీగా ఉండదు. ఎందుకంటే ఆ పార్టీ కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. తొందర్లో ఆ రాష్ట్రాలను కూడా కోల్పోతుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రె్ పార్టీ ఇండియన్ కాదు. అది జాతీయ పార్టీ కాదు. అది కేవలం అన్నాచెల్లెళ్ల పార్టీ. కాంగ్రెస్ ఎక్కడైనా కనిపిస్తోందా?’’ అని నడ్డా ప్రశ్నించారు. ఇంకా ఆయన ‘‘అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలు అయ్యాయియ. ఒక్క బీజేపీ తప్ప మరే ఇతర జాతీయ పార్టీ లేదు’’ అని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఉదహరిస్తూ అన్నింటినీ కుటుంబ పార్టీలని నడ్డా తేల్చేశారు.

Updated Date - 2022-04-30T01:01:25+05:30 IST