కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం

ABN , First Publish Date - 2021-06-20T05:23:45+05:30 IST

కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం

కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం
వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, నాయకులు

  • ఘనంగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలు 
  • పలు చోట్ల నాయకుల సేవా కార్యక్రమాలు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ జన్మదిన వేడు కలను శనివారం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు, శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పేదలకు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారం లోకి రావడం ఖాయమ న్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే శ్రేణుల లక్ష్యమన్నారు. వేడుకలో సీని యర్‌ నాయకులు చల్లా కవితాబాల్‌ రెడ్డి,  భాస్కర్‌ రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, భూపాల్‌ రెడ్డి, సిద్దల మౌనిక శ్రీశైలం, వెంక టేష్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు. 

దేశప్రజల ఆశాజ్యోతి రాహుల్‌గాంధీ..

కందుకూరు/మహేశ్వరం/చేవెళ్ల/మొయినాబాద్‌/షాబాద్‌ : రాహుల్‌గాంధీ దేశ ప్రజల ఆశాజ్యోతి  అని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, జడ్పీ మాజీ ఫ్లోర్‌లీడర్‌ ఏనుగు జంగారెడ్డిలు అభివర్ణించారు. రాహుల్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిరుపేదలకు మాస్కులు, శానిటైజర్లు, పండ్లను పంపిణీ చేశారు. అనంతరం చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి పంపిణీ చేసిన నాలుగు లక్షల విలువగల ఏడు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను మండల కేంద్రంలోని భూలక్ష్మి మెమోరియల్‌ ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ మహేందర్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గం సీనియ ర్‌ నాయకులు దేప భాస్కర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ శమంతప్రభాకర్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు డిల్లీ శ్రీధర్‌, నాయకులు బి. భూపాల్‌రెడ్డి, ఎండీ అఫ్జల్‌బేగ్‌, ఎండీ మోహనుద్దీన్‌, పి.సురేందర్‌, జగదీశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌ జన్మదిన వేడుకలు మహేశ్వరం మండల కేంద్రంతోపాటు తుక్కుగూడ మున్సిపల్‌ పరిదిలో ఘనంగా జరిగాయి. మహేశ్వరం మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాకి ఈశ్వర్‌, తుక్కుగూడ మున్సిపల్‌ అద్యక్షుడు జంపన్నల ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు పండ్లు పింపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డిలు మాట్లాడుతూ రాహుల్‌గాంధీ పేదల పక్షాన నిత్యం పోరాడుతూ ముందుకు సాగుతున్నాడని అన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు జానకీరామ్‌, ఏనుగు జంగారెడ్డి, ఈశ్వర్‌, జంపన్న, కుమార్‌, తిరుపతయ్య, జ్ఞానేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు. చేవెళ్లలో కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివా్‌సగౌడ్‌, మండల అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలోని అన్నివర్గాలకు న్యాయం కాంగ్రెస్‌ పార్టీతో సాధ్యమౌతుందన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల సర్పంచ్‌ బండారు శైలజాఆగిరెడ్డి, మాజీ సర్పంచ్‌ నర్సింలు, కాంగ్రెస్‌ నాయకులు పాండుయాదవ్‌,  మల్లేశ్‌యాదవ్‌, ప్రభాకర్‌, జనార్దన్‌, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌ జన్మదిన వేడుకలను మొయినాబాద్‌ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి పార్టీ శ్రేణులంతా కృషిచేయాలని కాంగ్రెస్‌ పార్టీ మొయినాబాద్‌ మండల అధ్యక్షుడు టి. మాణయ్య, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు షాబాద్‌ దర్శన్‌ అన్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌చేసి, మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మెన్‌ చంద్రారెడ్డి, ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి,  నాయకులు కేబుల్‌ రాజు, యాదయ్య, శ్రీనివా్‌సరెడ్డి, నర్సింగ్‌రావు, రవీందర్‌రెడ్డి, మహేందర్‌, వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అలాగే రాహుల్‌గాంధీని భావిభారత ప్రధానిగా ప్రజలు కోరుకుంటున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పామెన భీంభరత్‌ పేర్కొన్నారు. షాబాద్‌ మండల కేంద్రంలో గ్రామపంచాయితీ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు కరోనాతో ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచడంతోపాటు వ్యవసాయ సంబంధిత మందులు, విత్తనాలపై భారం మోపడంతో సామాన్య రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో డీసీసీ జిల్లా కార్యదర్శి పామెన భార్గవరాం, యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పెంటారెడ్డి, నాయకులు కుద్దుస్‌, చెన్నయ్య, రాంచంద్రయ్య, తదితరులున్నారు.

 సంచార జాతుల దుస్థితి పట్టని ప్రభుత్వం

షాద్‌నగర్‌అర్బన్‌/చౌదరిగూడ/నందిగామ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా.. సంచార జాతుల దుస్థితిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను శనివారం షాద్‌నగర్‌లోని సిండికెట్‌ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంచార జాతుల వారికి మాస్కులు, శానిటైజర్లు, పండ్లు అందజేశారు. చౌదరిగూడ మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో శనివారం రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ యాదమ్మ, వైస్‌ ఎంపీపీ ఆశ్రాబేగం, నాయకులు ఖలీల్‌, పాల్గొన్నారు. నందిగామ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జంగ సర్సింలు, జిల్లెల్ల రాంరెడ్డి, ఎంపీటీసీలు కృష్ణ, కుమార్‌గౌడ్‌, చంద్రపాల్‌రెడ్డి, రాజగోపాల్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

కొవిడ్‌ బాధితులకు అండగా..

షాద్‌నగర్‌అర్బన్‌/కడ్తాల్‌/యాచారం : బాధితులకు ఎన్‌ఎ్‌సయూఐ అండగా నిలుస్తున్నదని ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్‌ వెంకట్‌ అన్నారు. కరోనాతో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఎన్‌ఎ్‌సయూఐ జాతీయ కన్వీనర్‌ దినే్‌షసాగర్‌ రూ.10వేలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు విష్ణు, అనుదీప్‌, ప్రవీణ్‌, నరేందర్‌, ఉదయ్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. కరోనాతో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ కడ్తాల మండల అధ్యక్షుడు యాట నర్సింహ, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బీక్యానాయక్‌ డిమాండ్‌ చేశారు. రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా కడ్తాల మండలం బోయిన్‌గుట్ట తండాలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. తండాలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాములు, మాజీ ఎంపీపీ బుగ్గయ్యగౌడ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ వెంకటేశ్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు జహంగీర్‌బాబా, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ యాచారం మండల నాయకులు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు, మాస్క్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ, నాయకులు అక్బర్‌, వి.తిరుమలేష్‌, మల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-20T05:23:45+05:30 IST