Rajasthan వ్యవహారం ఓ కొలిక్కి... త్వరలోనే కేబినెట్ విస్తరణ

ABN , First Publish Date - 2021-07-25T19:50:42+05:30 IST

రాజస్థాన్ వ్యవహారాన్ని అధిష్ఠానం ఓ కొలిక్కి తెచ్చింది. ముఖ్యమంత్రి గెహ్లోత్, యువనేత సచిన్ పైలట్ మధ్య కొద్ది రోజులుగా పొరపొచ్చాలు వచ్చాయి

Rajasthan వ్యవహారం ఓ కొలిక్కి... త్వరలోనే కేబినెట్ విస్తరణ

న్యూఢిల్లీ :  రాజస్థాన్ వ్యవహారాన్ని అధిష్ఠానం ఓ కొలిక్కి తెచ్చింది. ముఖ్యమంత్రి గెహ్లోత్, యువనేత సచిన్ పైలట్ మధ్య కొద్ది రోజులుగా పొరపొచ్చాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ పొరపొచ్చాలకు స్వస్తి పలకాలని అధిష్ఠానం పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 28 న మంత్రివర్గ విస్తరణ చేపట్టి, ఈ పొరపొచ్చాలకు పులిస్టాప్ పెట్టనున్నారు. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జీ కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ వ్యవహారాల ఇన్‌చార్జీ అజయ్ మాకెన్ ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. పైలట్ వర్గీయులతో పాటు సీఎం గెహ్లోత్ వర్గీయులతోనూ భేటీ అయ్యారు. చివరికి కేబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ అజయ్ మాకెన్ మాట్లాడుతూ... ‘‘కేబినెట్ విస్తరణ గురించి చర్చించాం. అలాగే సంస్థాగత పదవులను కూడా భర్తీ చేస్తాం. అతి త్వరలోనే కేబినెట్ విస్తరణ తేదీని ప్రకటిస్తాం. గెహ్లోత్ నాయకత్వాన్ని అంగీకరిస్తామని అందరూ ప్రకటించారు’’ అని అజయ్ మాకెన్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-25T19:50:42+05:30 IST