Batti vikramarka comments: ఇంతకీ కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద ఏం జరుగుతోంది?

ABN , First Publish Date - 2022-07-30T19:11:34+05:30 IST

ఎనిమిదేళ్ల రాష్ట్ర ఆదాయం, అప్పు మొత్తం కాళేశ్వరాని ధార పోశారని... వరదకు మొత్తం అది మునిగి పోయి, నిరుపయోగంగా మారిందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు.

Batti vikramarka comments: ఇంతకీ కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద ఏం జరుగుతోంది?

హైదరాబాద్: ఎనిమిదేళ్ల రాష్ట్ర ఆదాయం, అప్పు మొత్తం కాళేశ్వరాని(Kaleshwaram)కి ధార పోశారని... వరదకు మొత్తం అది మునిగి పోయి, నిరుపయోగంగా మారిందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క (Batti vikramarka) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ...ఇంతకీ ప్రాజెక్ట్ వద్ద ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ఎవరైనా వెళతాం అంటే ఎందుకు అడ్డుకుంటున్నారని అడిగారు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి సీఎల్పీ బృందంతో కలిసి కాళేశ్వరం వెళనున్నట్లు తెలిపారు. జరిగిన నష్టంపై చర్చించడానికి వెంటనే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే సీఎం ఢిల్లీ వెళ్లి ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టోద్దని భట్టి విక్రమార్క హితవుపలికారు. 


రాజగోపాల్ రెడ్డి పార్టీలోనే ఉండేలా కృషి చేస్తాం....

రాజగోపాల్ రెడ్డి(Rajagopal reddy)తో తమ అధిష్టానం కూడా మాట్లాడిందని తెలిపారు. ‘‘ఆయన మా శాసన సభ్యుడు..నేను కూడా మాట్లాడాను. ఆయన ఇబ్బందులు తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తాం. సాధ్యం అయినంత వరకు ఆయన పార్టీలోనే ఉండేలా కృషిచేస్తామని భట్టి విక్రమర్క పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-30T19:11:34+05:30 IST