సోనియాతో ఆజాద్ ఏం మాట్లాడారంటే?

ABN , First Publish Date - 2022-03-19T00:35:32+05:30 IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో అసమ్మతి నేతల జీ23 సభ్యుడైన గులాం నబీ ఆజాద్ గంటకు పైగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.

సోనియాతో ఆజాద్ ఏం మాట్లాడారంటే?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో అసమ్మతి నేతల జీ23 సభ్యుడైన గులాం నబీ ఆజాద్ గంటకు పైగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించారు. పార్టీలో నాయకత్వ మార్పు అంశంపై జీ23 సభ్యులేమనుకుంటున్నారో కూడా ఆజాద్ వివరించారు. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు సలహాలు ఇచ్చానని ఆజాద్ వెల్లడించారు. 2024 ఎన్నికలకు సంసిద్ధం కావాలని సమావేశంలో నిర్ణయించామని సమావేశానంతరం ఆజాద్ తెలిపారు. ప్రస్తుతానికి పార్టీకి అధ్యక్షురాలిగా సోనియా కొనసాగుతారని ఆజాద్ స్పష్టం చేశారు. ఇంటి కాంగ్రెస్ కాకుండా అందరి కాంగ్రెస్ కావాలని సీనియర్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యానించినప్పటినుంచీ పార్టీలో కలకలం రేగుతోంది. ఇటీవలి ఎన్నికల ఫలితాల్లో ఓటమి బాధ్యత ఎవరు తీసుకుంటారని పార్టీ సీనియర్ మనీశ్ తివారి ప్రశ్నించడం పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. 



Updated Date - 2022-03-19T00:35:32+05:30 IST