Heavy Rains: బెంగళూరులో వర్ష బీభత్సం.. కాంగ్రెస్ నేత వినూత్న నిరసన..

ABN , First Publish Date - 2022-09-07T18:05:22+05:30 IST

బెంగళూరు (Bangalore): నగరంలో వర్షాలు బీభత్సం (Heavy Rains) సృష్టిస్తున్నాయి.

Heavy Rains: బెంగళూరులో వర్ష బీభత్సం.. కాంగ్రెస్ నేత వినూత్న నిరసన..

బెంగళూరు (Bangalore): నగరంలో వర్షాలు బీభత్సం (Heavy Rains) సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షం నగరాన్ని రెండు నెలల్లో రెండోసారి అతలాకుతలం చేసింది. వరద నీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. సిలికాన్ రాజధాని బెంగళూరులో ముంచెత్తిన ఆకస్మిక వరదలు పరిపాలన నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తేలా చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితులను నిర్వహించగల సామర్థ్యం నగర పౌర సంస్థకు ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


ఈ నేపథ్యంలో కర్నాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నలపాడ్ (Nalapad) వినూత్న నిరసన (Innovative protest) చేపట్టారు. వర్షపు నీటితో నిండి.. అస్తవ్యస్తంగా మారిన రోడ్లపై ట్యూబ్ వేసుకుని ప్రయాణిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగళూరును సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా (Silicon City of India)గా పిలిచేవారని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం (BJP Govt.) మునిగిపోయే నగరంగా మార్చిందని ఆరోపించారు. నగరం ఎదుర్కొంటున్న అన్ని విపత్తులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని నలపాడ్ డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. రోడ్లపై పారుతున్న నలపాడ్ నీటిపై తేలియాడుతూ నిరసన తెలుతున్న దృశ్యాలు  సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Updated Date - 2022-09-07T18:05:22+05:30 IST