పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం బాధాకరం: Sailajanath

Published: Thu, 14 Apr 2022 08:16:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం బాధాకరం: Sailajanath

అమరావతి: ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం బాధాకరమని పీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రియాక్టర్ పేలి 6 గురు సజీవదహనం అవ్వడం కలచి వేసిందని తెలిపారు.  గాయపడిన 12 మందికి మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్  చేశారు. ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరించడం వల్లే ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతున్నాయని మండిపడ్డారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.